ఈఁతకు మిక్కిలి లోఁతు యిఁక లేదు
(॥పల్లవి॥)
ఈఁతకు మిక్కిలి లోఁతు యిఁక లేదు
బాఁతిపడ నేమనఁగా భయమేల నీకు
(॥ఈఁత॥)
నీమనసు రావలసి నెలఁతఁ దోడితెచ్చితి
యేమి సేయవలెనయ్యా ఇంకా నీకు
కామించి యానతీవయ్యా కడుసిగ్గువడనేల
నేమెల్లా గలుగఁగాను నీ కేమిగడను
(॥ఈఁత॥)
వేడుకలు గావలసి విడే లిద్దరి కిచ్చితి
వోడక సేయించుకో వో యుచితా లింక
చూడరాదా నాదిక్కు సూటిగా మఱఁగులేల
వూడిగము నేఁజేయఁగా వొదుగ నీకేల
(॥ఈఁత॥)
కూటమి మీకు వలసి గొబ్బునఁ దెరవేసితి
యేఁటికి నెరపరికా లింకా నీకు
నీటున శ్రీ వేంకటేశ నే నలమేలుమంగను
చోటిచ్చి నే లోగఁగా సుద్దులు మరేఁటికి
(||pallavi||)
īm̐tagu mikkili lom̐tu yim̐ka ledu
bām̐tibaḍa nemanam̐gā bhayamela nīgu
(||īm̐ta||)
nīmanasu rāvalasi nĕlam̐tam̐ doḍidĕchchidi
yemi seyavalĕnayyā iṁkā nīgu
kāmiṁchi yānadīvayyā kaḍusigguvaḍanela
nemĕllā galugam̐gānu nī kemigaḍanu
(||īm̐ta||)
veḍugalu gāvalasi viḍe liddari kichchidi
voḍaga seyiṁchugo vo yusidā liṁka
sūḍarādā nādikku sūḍigā maṟam̐gulela
vūḍigamu nem̐jeyam̐gā vŏduga nīgela
(||īm̐ta||)
kūḍami mīgu valasi gŏbbunam̐ dĕravesidi
yem̐ṭigi nĕrabarigā liṁkā nīgu
nīḍuna śhrī veṁkaḍeśha ne nalamelumaṁganu
soḍichchi ne logam̐gā suddulu marem̐ṭigi