ఈకెను మన్నించవద్దా ఇంతటనైనా
(॥పల్లవి॥)
ఈకెను మన్నించవద్దా ఇంతటనైనా
చేకొని యీరీతి నీ సేవలెల్లాఁ జేసెను
(॥ఈకె॥)
వినయముతో నీకు విన్నపము సేయుమని
తనమారు చెలి నంపెఁ దరుణి
చనవునఁ దనమారు సాగిలి మొక్కించుమని
కనకపుబొమ్మ నంపెఁ గనుఁగొనవయ్యా
(॥ఈకె॥)
నించి తనమారు యిట్టె నిన్ను సింగారించుమని
మించిన పూదండ యంపె మెలుఁత నేఁడు
పంచనుండి తనమారు పంతము నీ కిమ్మని
అంచెల ముంజేతి చిల్క నంపెను నీవద్దికి
(॥ఈకె॥)
నెలకొని తనమారు నీకుఁ బాదాలొత్తుమని
మెలుపున వజ్రాల మించు లంపెను
నిలిచి శ్రీవేంకటేశ నెట్టవఁ దానె వచ్చి
కళలంటి వేఁడుకొని కాఁగిలించె నిన్నును
(||pallavi||)
īgĕnu manniṁchavaddā iṁtaḍanainā
segŏni yīrīdi nī sevalĕllām̐ jesĕnu
(||īgĕ||)
vinayamudo nīgu vinnabamu seyumani
tanamāru sĕli naṁpĕm̐ daruṇi
sanavunam̐ danamāru sāgili mŏkkiṁchumani
kanagabubŏmma naṁpĕm̐ ganum̐gŏnavayyā
(||īgĕ||)
niṁchi tanamāru yiṭṭĕ ninnu siṁgāriṁchumani
miṁchina pūdaṁḍa yaṁpĕ mĕlum̐ta nem̐ḍu
paṁchanuṁḍi tanamāru paṁtamu nī kimmani
aṁchĕla muṁjedi silga naṁpĕnu nīvaddigi
(||īgĕ||)
nĕlagŏni tanamāru nīgum̐ bādālŏttumani
mĕlubuna vajrāla miṁchu laṁpĕnu
nilisi śhrīveṁkaḍeśha nĕṭṭavam̐ dānĕ vachchi
kaḽalaṁṭi vem̐ḍugŏni kām̐giliṁchĕ ninnunu