ఈకెమీఁద బత్తిగలఁ డిప్పడే మన్నించీఁ గాక
(॥పల్లవి॥)
ఈకెమీఁద బత్తిగలఁ డిప్పడే మన్నించీఁ గాక
చేకొని వో చెలులాల చెప్పరమ్మా
(॥ఈకె॥)
చెక్కుపై నున్నది చేయి చిత్తములోనిది నూయి
యెక్కడ వేగించునమ్మ యీకొమ్మ
ముక్కుపైఁ బెట్టెను వేలు ముంచెను చెమటజాలు
గక్కనఁ బతికిఁ జెప్పఁగదరమ్మా
(॥ఈకె॥)
వీడియు వీడని కొప్ప విరవేదనచొప్పు
యేడకేడ వోపునమ్మ యీకొమ్మ
వాడుదేరేఁ యెమ్మావి వచ్చెఁ గన్నులకుఁగావి
చెడెభావ మాతనికిఁ జెప్పరమ్మా
(॥ఈకె॥)
నీవి వదలిన జారు నివ్వెరగుమేనితీరు
యీవిధాన నున్నదమ్మ యీకొమ్మ
భావించి తాఁ గూడినాఁడు పంతముతో వచ్చి నేఁడు
శ్రీవేంకటేశుని కింకాఁ జెప్పరమ్మా
(||pallavi||)
īgĕmīm̐da battigalam̐ ḍippaḍe manniṁchīm̐ gāga
segŏni vo sĕlulāla sĕpparammā
(||īgĕ||)
sĕkkubai nunnadi seyi sittamulonidi nūyi
yĕkkaḍa vegiṁchunamma yīgŏmma
mukkubaim̐ bĕṭṭĕnu velu muṁchĕnu sĕmaḍajālu
gakkanam̐ badigim̐ jĕppam̐gadarammā
(||īgĕ||)
vīḍiyu vīḍani kŏppa viravedanasŏppu
yeḍageḍa vobunamma yīgŏmma
vāḍuderem̐ yĕmmāvi vachchĕm̐ gannulagum̐gāvi
sĕḍĕbhāva mādanigim̐ jĕpparammā
(||īgĕ||)
nīvi vadalina jāru nivvĕragumenidīru
yīvidhāna nunnadamma yīgŏmma
bhāviṁchi tām̐ gūḍinām̐ḍu paṁtamudo vachchi nem̐ḍu
śhrīveṁkaḍeśhuni kiṁkām̐ jĕpparammā