ఈకెకు నీకును దగు యిన్నిటా నెంచి చూచితే
(॥పల్లవి॥)
ఈకెకు నీకును దగు యిన్నిటా నెంచి చూచితే
వాకుచ్చి యెంతని మిము వర్ణించవచ్చునయా
(॥ఈకె॥)
చెలి నీ గుణాలు విని చేతులెత్తి నీకు మొక్కె
అలరి నీ తోడి పొందు లాసగించెను
వలచి నీపేర లే వా(వ్రా?) యఁబూని సిగ్గువడి
కలికి సుద్దులు చెప్పఁ గతలాయనయ్యా
(॥ఈకె॥)
చక్కని నీమోము చూచె సతులతోడఁ బొగడె
అక్కరతో నాడనుండే యారతి యెత్తె
చొక్కి నీకుఁ గానుకియ్యఁ జూచి తనలోనే నవ్వె
మక్కువ చందమెంతని మరి చెప్పేమయ్యా
(॥ఈకె॥)
యింటికి నిన్ను రమ్మనె నింతలోనే కాఁగిలించె
జంటయై పానుపుమీఁద సరిఁ గూచుండె
వొంటి నీతో మాటలాడె నొద్దికై శ్రీవేంకటేశ
వింటిమి మీమచ్చికలు వేడుకాయనయ్యా
(||pallavi||)
īgĕgu nīgunu dagu yinniḍā nĕṁchi sūside
vāguchchi yĕṁtani mimu varṇiṁchavachchunayā
(||īgĕ||)
sĕli nī guṇālu vini sedulĕtti nīgu mŏkkĕ
alari nī toḍi pŏṁdu lāsagiṁchĕnu
valasi nībera le vā(vrā?) yam̐būni sigguvaḍi
kaligi suddulu sĕppam̐ gadalāyanayyā
(||īgĕ||)
sakkani nīmomu sūsĕ saduladoḍam̐ bŏgaḍĕ
akkarado nāḍanuṁḍe yāradi yĕttĕ
sŏkki nīgum̐ gānugiyyam̐ jūsi tanalone navvĕ
makkuva saṁdamĕṁtani mari sĕppemayyā
(||īgĕ||)
yiṁṭigi ninnu rammanĕ niṁtalone kām̐giliṁchĕ
jaṁṭayai pānubumīm̐da sarim̐ gūsuṁḍĕ
vŏṁṭi nīdo māḍalāḍĕ nŏddigai śhrīveṁkaḍeśha
viṁṭimi mīmachchigalu veḍugāyanayyā