Eege galumgamga gadaa yinniyunu velavetti

ఈకె గలుఁగఁగ గదా యిన్నియును వెలవెట్టి
Language

(॥పల్లవి॥)
ఈకె గలుఁగఁగ గదా యిన్నియును వెలవెట్టి
దాకొని వొండొకటితో దారుకాణ లాయనే

(॥ఈకె॥)
పొలఁతి మోమునఁ బోలు పున్నమచందురుఁడు
కలికి కన్నులఁ బోలు కలువ లివి
నిలువుఁ దురుముఁబోలు నెమ్మదిఁదుమ్మిదగుంపు
యెలిమె మదనుసిరు లెంతనోము నోఁచెనే

(॥ఈకె॥)
వనిత బొమ్మలఁ బోలు వరుసఁ జెరకుటిల్లు
చనుగుబ్బలనుఁ బోలు చక్రవాకాలు
తనువునఁ బోలును తాలిమితోఁ జిగురాకు
యెనలేని మరుసిరు లెంత నోము నోఁచెనే

(॥ఈకె॥)
యింతి పిరుఁదులఁబోలు యీతని బండి కండ్లు
చెంతఁ బాదాలఁబోలు చెందామరలు
సంతోసాన శ్రీవేంకటేశ్వురుఁడు గాఁగిటఁ గూడె
యింతటాఁ గంతుని సిరు లెంతనోము నోఁచెనే

(||pallavi||)
īgĕ galum̐gam̐ga gadā yinniyunu vĕlavĕṭṭi
dāgŏni vŏṁḍŏgaḍido dārugāṇa lāyane

(||īgĕ||)
pŏlam̐ti momunam̐ bolu punnamasaṁdurum̐ḍu
kaligi kannulam̐ bolu kaluva livi
niluvum̐ durumum̐bolu nĕmmadim̐dummidaguṁpu
yĕlimĕ madanusiru lĕṁtanomu nom̐sĕne

(||īgĕ||)
vanida bŏmmalam̐ bolu varusam̐ jĕraguḍillu
sanugubbalanum̐ bolu sakravāgālu
tanuvunam̐ bolunu tālimidom̐ jigurāgu
yĕnaleni marusiru lĕṁta nomu nom̐sĕne

(||īgĕ||)
yiṁti pirum̐dulam̐bolu yīdani baṁḍi kaṁḍlu
sĕṁtam̐ bādālam̐bolu sĕṁdāmaralu
saṁtosāna śhrīveṁkaḍeśhvurum̐ḍu gām̐giḍam̐ gūḍĕ
yiṁtaḍām̐ gaṁtuni siru lĕṁtanomu nom̐sĕne