Eedanela maadone yimtabeeraalu

ఈడనేల మాతోనే యింతబీరాలు
Language

(॥పల్లవి॥)
ఈడనేల మాతోనే యింతబీరాలు
వాడవారితోనే పోయి వాదించరాదా

(॥ఈడ॥)
కొల్లున నే నవ్వి తేనే కొంగువట్టేవు రేపల్లె-
నల్లవారు నిన్ను నవ్వే రందు వొవోయి
చల్లగా నేఁ జూచితేనే జంకించేవు పురసతు-
లుల్లసాన నిన్నుఁజూచే రొద్దనఁగరాదా

(॥ఈడ॥)
ఆఁటదాన వద్దనుంటే నాసపడేవు చుప్పనాఁతి
ఆఁటదిగాదా నీ వందు వోవోయీ
మేఁటివంటా మొక్కితేనే మేలమాడేవు యింతైతే
నాఁటికొలనిసతుల నసలు విడుతురా

(॥ఈడ॥)
గందము పైఁజల్లితేనే కడుఁదిట్టేవు తొల్లి
గందమువారింటిసతి బొందవా వోయి
కందువ శ్రీవేంకటేశ కాఁగిటఁ గూడితి నన్ను
వొందిలి నీకొనగోర నొత్త నింకావలెనా

(||pallavi||)
īḍanela mādone yiṁtabīrālu
vāḍavāridone poyi vādiṁcharādā

(||īḍa||)
kŏlluna ne navvi tene kŏṁguvaṭṭevu reballĕ-
nallavāru ninnu navve raṁdu vŏvoyi
sallagā nem̐ jūsidene jaṁkiṁchevu purasadu-
lullasāna ninnum̐jūse rŏddanam̐garādā

(||īḍa||)
ām̐ṭadāna vaddanuṁṭe nāsabaḍevu suppanām̐ti
ām̐ṭadigādā nī vaṁdu vovoyī
mem̐ṭivaṁṭā mŏkkidene melamāḍevu yiṁtaide
nām̐ṭigŏlanisadula nasalu viḍudurā

(||īḍa||)
gaṁdamu paim̐jallidene kaḍum̐diṭṭevu tŏlli
gaṁdamuvāriṁṭisadi bŏṁdavā voyi
kaṁduva śhrīveṁkaḍeśha kām̐giḍam̐ gūḍidi nannu
vŏṁdili nīgŏnagora nŏtta niṁkāvalĕnā