Eedamde raghuraamum deedam degaamgaveerumdu

ఈతఁడే రఘురాముఁ డీతఁ డేకాంగవీరుఁడు
Language

(॥పల్లవి॥)
ఈతఁడే రఘురాముఁ డీతఁ డేకాంగవీరుఁడు
యీతఁడు చేసిన చేఁత లెన్నియైనాఁ గలవు

(॥ఈతఁ॥)
ఖరదూషణాదులను ఖండ తుండములు సేసె
అరుదుగా వాలి నొక్కయమ్మున నేసె
సరవిఁ గొండలచేత సముద్రము బంధించె
ఇరవై విభీషణుని కిచ్చె లంకారాజ్యము

(॥ఈతఁ॥)
కూడపెట్టె వానరుల, కుంభకర్ణాదిదైత్యుల
తోడనే రావణుఁ జంపె దురముగెల్చె
వేడుకతో సీతాదేవిఁ గూడెను పుష్పక మెక్కె
యీడు జోడై సింహాసన మేలె నయోధ్యలోన

(॥ఈతఁ॥)
పుడమియంతయుఁ గాచె పొందుగాఁ దనంతలేసి -
కొడుకులఁ గాంచెను కుశలవుల
యెడయక శ్రీవేంకటేశుఁడై వరములిచ్చె
అడరి తారకబ్రహ్మమై ఇదె వెలసె

(||pallavi||)
īdam̐ḍe raghurāmum̐ ḍīdam̐ ḍegāṁgavīrum̐ḍu
yīdam̐ḍu sesina sem̐ta lĕnniyainām̐ galavu

(||īdam̐||)
kharadūṣhaṇādulanu khaṁḍa tuṁḍamulu sesĕ
arudugā vāli nŏkkayammuna nesĕ
saravim̐ gŏṁḍalaseda samudramu baṁdhiṁchĕ
iravai vibhīṣhaṇuni kichchĕ laṁkārājyamu

(||īdam̐||)
kūḍabĕṭṭĕ vānarula, kuṁbhagarṇādidaityula
toḍane rāvaṇum̐ jaṁpĕ duramugĕlsĕ
veḍugado sīdādevim̐ gūḍĕnu puṣhpaga mĕkkĕ
yīḍu joḍai siṁhāsana melĕ nayodhyalona

(||īdam̐||)
puḍamiyaṁtayum̐ gāsĕ pŏṁdugām̐ danaṁtalesi -
kŏḍugulam̐ gāṁchĕnu kuśhalavula
yĕḍayaga śhrīveṁkaḍeśhum̐ḍai varamulichchĕ
aḍari tāragabrahmamai idĕ vĕlasĕ