Eedam dettumdinaa nemi yimtulaala

ఈతఁ డెట్టుండినా నేమి యింతులాల
Language

(॥పల్లవి॥)
ఈతఁ డెట్టుండినా నేమి యింతులాల
కాతరించి వెంగమాడి గయ్యళించఁదగవా

(॥ఈతఁ॥)
నగేవారివలెనే నాయకుని భావమెల్లా -
నగడుగాఁ జేతురా అక్కలాల
మొగము చూడఁగదరే మోహము నాపైఁ గురిసీ
తగ నితనిమీఁదట తప్పు లెంచఁదగవా

(॥ఈతఁ॥)
చుట్టాలవలెనే వుండి చొప్పులెత్తి మీ రితని -
గుట్టు బాయట వేతురా కొమ్మలాల
యెట్టుచేసినా నేమి నాయింటనే తా నున్న వాఁడు
నెట్టుకొని యీతని నేర మెంచఁదగవా

(॥ఈతఁ॥)
మంచివారివలెనే మాటలు వెలుచుకొని
పొంచి సిగ్గువరతురా పొలఁతులాల
యెంచఁగ శ్రీవేంకటేశుఁ డీతఁడే నన్ను నేలె
అంచెల నీతనినింకా అలయించఁదగవా

(||pallavi||)
īdam̐ ḍĕṭṭuṁḍinā nemi yiṁtulāla
kādariṁchi vĕṁgamāḍi gayyaḽiṁcham̐dagavā

(||īdam̐||)
nagevārivalĕne nāyaguni bhāvamĕllā -
nagaḍugām̐ jedurā akkalāla
mŏgamu sūḍam̐gadare mohamu nābaim̐ gurisī
taga nidanimīm̐daḍa tappu lĕṁcham̐dagavā

(||īdam̐||)
suṭṭālavalĕne vuṁḍi sŏppulĕtti mī ridani -
guṭṭu bāyaḍa vedurā kŏmmalāla
yĕṭṭusesinā nemi nāyiṁṭane tā nunna vām̐ḍu
nĕṭṭugŏni yīdani nera mĕṁcham̐dagavā

(||īdam̐||)
maṁchivārivalĕne māḍalu vĕlusugŏni
pŏṁchi sigguvaradurā pŏlam̐tulāla
yĕṁcham̐ga śhrīveṁkaḍeśhum̐ ḍīdam̐ḍe nannu nelĕ
aṁchĕla nīdaniniṁkā alayiṁcham̐dagavā