ఈతలఁ పెరిఁగి నీవే యీకెను మన్నించవయ్యా
(॥పల్లవి॥)
ఈతలఁ పెరిఁగి నీవే యీకెను మన్నించవయ్యా
కాతరాన నీకుఁగానే కాచుకొని వున్నది
(॥ఈత॥)
సారెసారె నిన్నుఁ జూచి సతి తన లోలోనె
వూరకె తమకమున నువ్విళ్లూరీని
చేరి నీవద్దఁ గూచుండి చిప్పిలు వలపులను
కోరికె తీరికె లెత్తఁ గురిసీఁ జెమటలు
(॥ఈత॥)
మత్తిలి నీతోడుత మాటలాడి యాడి చెలి
చిత్తజ కేలి రతులఁ జిమ్మిరేఁగీని
హత్తి నిన్నుఁ జెనకేటి యాసలు మిక్కుటమై
కొత్త కొత్త వేడుకల గుబ్బతిలీ మనసు
(॥ఈత॥)
గుట్టుతోడ మొక్కుమొక్కి కుచ్చి నిన్నుఁ గాఁగిలించి
అట్టె నివ్వెరగందె నలమేల్మంగ
గట్టిగా శ్రీవేంకటేశ కలసితి వీకె నిట్టె
వొట్టుకొన్న సంతోసాల నోలలాడీ నిపుడు
(||pallavi||)
īdalam̐ pĕrim̐gi nīve yīgĕnu manniṁchavayyā
kādarāna nīgum̐gāne kāsugŏni vunnadi
(||īda||)
sārĕsārĕ ninnum̐ jūsi sadi tana lolonĕ
vūragĕ tamagamuna nuvviḽlūrīni
seri nīvaddam̐ gūsuṁḍi sippilu valabulanu
korigĕ tīrigĕ lĕttam̐ gurisīm̐ jĕmaḍalu
(||īda||)
mattili nīdoḍuda māḍalāḍi yāḍi sĕli
sittaja keli radulam̐ jimmirem̐gīni
hatti ninnum̐ jĕnageḍi yāsalu mikkuḍamai
kŏtta kŏtta veḍugala gubbadilī manasu
(||īda||)
guṭṭudoḍa mŏkkumŏkki kuchchi ninnum̐ gām̐giliṁchi
aṭṭĕ nivvĕragaṁdĕ nalamelmaṁga
gaṭṭigā śhrīveṁkaḍeśha kalasidi vīgĕ niṭṭĕ
vŏṭṭugŏnna saṁtosāla nolalāḍī nibuḍu