Eebevamti dittadana meda neevu gamtivayya

ఈపెవంటి దిట్టతన మేడ నీవు గంటివయ్య
Language

(॥పల్లవి॥)
ఈపెవంటి దిట్టతన మేడ నీవు గంటివయ్య
నీ పాదము లొత్తుతాను నీవద్దనే వున్నది

(॥ఈపె॥)
ఆసల నిన్నుఁ దిట్టీ అన్నిటికి సెలవుగా
సేసకొప్పు వంచి నీకు చెలి మొక్కీని
సేసేచేఁత నిన్నుఁ జేసి చిత్తమురా వలసి
మూసినముతైమై ముందటనే వున్నది

(॥ఈపె॥)
నీమోవి గంటిసేసీ నేరమెలెల్లాఁ దీర
చేముట్టి కప్రవిడెము చేతికిచ్చీని
సాముసేసినట్లనే చన్నులను నిన్ను నొత్తి
ఆముకొని పంతమిచ్చి ఆయమంటుచున్నది

(॥ఈపె॥)
పాదమునేఁదాకించీ భయమెల్లాఁ బాయను
సాదువలెఁగా గాఁగిలించి సరిఁగూడీని
యీదెస శ్రీవేంకటేశ యేలితివి మమ్ము నిట్టె
ఆదరించి కమ్మటిని ఆసరేఁపుచున్నది

(||pallavi||)
ībĕvaṁṭi diṭṭadana meḍa nīvu gaṁṭivayya
nī pādamu lŏttudānu nīvaddane vunnadi

(||ībĕ||)
āsala ninnum̐ diṭṭī anniḍigi sĕlavugā
sesagŏppu vaṁchi nīgu sĕli mŏkkīni
sesesem̐ta ninnum̐ jesi sittamurā valasi
mūsinamudaimai muṁdaḍane vunnadi

(||ībĕ||)
nīmovi gaṁṭisesī neramĕlĕllām̐ dīra
semuṭṭi kapraviḍĕmu sedigichchīni
sāmusesinaṭlane sannulanu ninnu nŏtti
āmugŏni paṁtamichchi āyamaṁṭusunnadi

(||ībĕ||)
pādamunem̐dāgiṁchī bhayamĕllām̐ bāyanu
sāduvalĕm̐gā gām̐giliṁchi sarim̐gūḍīni
yīdĕsa śhrīveṁkaḍeśha yelidivi mammu niṭṭĕ
ādariṁchi kammaḍini āsarem̐pusunnadi