Eebegu galugu bimka mela neegu ledaaya

ఈపెకు గలుగు బింక మేల నీకు లేదాయ
Language

(॥పల్లవి॥)
ఈపెకు గలుగు బింక మేల నీకు లేదాయ
మాపు దాఁకా నీవెంత మనసు చూచేవు

(॥ఈపె॥)
వొడ్డాఁ బెట్టా మాటలాడి వువిద జంకించఁగాను
వెడ్డువెట్టి నీవెంత వేఁడుకొనేవు
వడ్డివారీనా ఆపె వలపులేమైనాను
యెడ్డవై నేఁడాఁట దానికేల కిందుపడేవు

(॥ఈపె॥)
సరికి బేసికి నింతి చలము సాదించఁగాను
అరుదుగా నింతేసి ప్రియాలు చెప్పేవు
గరివడీనా తనకందువైన ననుపెల్లా
మరిగి యిల్లాలికేల మతిలోఁ గొంకేవు

(॥ఈపె॥)
కోరి వేఁడియాపె నిన్ను కుచముల నొత్తగాను
సారె సారె నీవెంత చనవిచ్చేవు
యీరీతి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
చేరి పెండ్లికూఁతు కెంత సేసేవు చవులు

(||pallavi||)
ībĕgu galugu biṁka mela nīgu ledāya
mābu dām̐kā nīvĕṁta manasu sūsevu

(||ībĕ||)
vŏḍḍām̐ bĕṭṭā māḍalāḍi vuvida jaṁkiṁcham̐gānu
vĕḍḍuvĕṭṭi nīvĕṁta vem̐ḍugŏnevu
vaḍḍivārīnā ābĕ valabulemainānu
yĕḍḍavai nem̐ḍām̐ṭa dānigela kiṁdubaḍevu

(||ībĕ||)
sarigi besigi niṁti salamu sādiṁcham̐gānu
arudugā niṁtesi priyālu sĕppevu
garivaḍīnā tanagaṁduvaina nanubĕllā
marigi yillāligela madilom̐ gŏṁkevu

(||ībĕ||)
kori vem̐ḍiyābĕ ninnu kusamula nŏttagānu
sārĕ sārĕ nīvĕṁta sanavichchevu
yīrīdi śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
seri pĕṁḍligūm̐tu kĕṁta sesevu savulu