ఈపె యేమి సేసును యింతి గడు ముద్దరాలు
(॥పల్లవి॥)
ఈపె యేమి సేసును యింతి గడు ముద్దరాలు
వోపిక నీకుఁ గలితే వొరసుకోవయ్యా
(॥ఈపె॥)
సిగ్గులువడే వారికి సెలవి నవ్వులు వచ్చు
యెగ్గువట్టి గరిసించ యేలయ్య నీకు
వెగ్గళించి ఇది నీకు వెంగములైతేఁ గనక
దిగ్గన నూరివారితో తెలుపుకోవయ్య
(॥ఈపె॥)
ముచ్చటలాడే వారికి మొక్కులు వేళమే వచ్చు
యెచ్చరి వుదిరిపడనేలయ్య నీకు
పచ్చిదేరి యిది నీకు పంగెములైతే గనక
కుచ్చి నీ పొరుగువారి కొంగు వట్టవయ్యా
(॥ఈపె॥)
వురముపై నుండేవారి కొద్దిక బీరము వచ్చు
యెరవుల పంతము లేలయ్య నీకు
అరిది శ్రీ వేంకటేశ ఆపె యలమేలుమంగ
సరిఁగూడె నొద్దివారి సాకిరెంచవయ్యా
(||pallavi||)
ībĕ yemi sesunu yiṁti gaḍu muddarālu
vobiga nīgum̐ galide vŏrasugovayyā
(||ībĕ||)
sigguluvaḍe vārigi sĕlavi navvulu vachchu
yĕgguvaṭṭi garisiṁcha yelayya nīgu
vĕggaḽiṁchi idi nīgu vĕṁgamulaidem̐ ganaga
diggana nūrivārido tĕlubugovayya
(||ībĕ||)
muchchaḍalāḍe vārigi mŏkkulu veḽame vachchu
yĕchchari vudiribaḍanelayya nīgu
pachchideri yidi nīgu paṁgĕmulaide ganaga
kuchchi nī pŏruguvāri kŏṁgu vaṭṭavayyā
(||ībĕ||)
vuramubai nuṁḍevāri kŏddiga bīramu vachchu
yĕravula paṁtamu lelayya nīgu
aridi śhrī veṁkaḍeśha ābĕ yalamelumaṁga
sarim̐gūḍĕ nŏddivāri sāgirĕṁchavayyā