ఈపాటివాఁడు తాను యిందాఁకా నేమిసేసె
(॥పల్లవి॥)
ఈపాటివాఁడు తాను యిందాఁకా నేమిసేసె
కాపుగా నే నీడ నిట్టె కాచుకుండనా
(॥ఈపా॥)
యెలమి నిందాఁకాఁదా నేడో పరాకై వుండి
తలఁచినప్పుడే తనతమి నామీఁద
వలసినచోట నెల్లా వలపెల్లా జల్లి వచ్చి
పలికినప్పుడే తనబత్తి నామీఁద
(॥ఈపా॥)
తిన్నవై వూరెల్లాను తిరుగాడివచ్చి నన్నుఁ
గన్నప్పుడే తన కాంక్షలెల్లాను
చిన్నిమదనమంత్రాలఁ జిక్కివుండి నామాఁటలు
విన్నప్పుడే తనవేడుకెల్లాను
(॥ఈపా॥)
వాడలో సతులఁ బొందివచ్చి వాకాఁగిటిలోనఁ
గూడి యిప్పుడేచెప్పీ గుట్టు మాకును
యీడవె శ్రీవేంకటేశుఁడిరవై నామోముచూచి
వాడికె నప్పుడే చూపీ వన్నె మాకును
(||pallavi||)
ībāḍivām̐ḍu tānu yiṁdām̐kā nemisesĕ
kābugā ne nīḍa niṭṭĕ kāsuguṁḍanā
(||ībā||)
yĕlami niṁdām̐kām̐dā neḍo parāgai vuṁḍi
talam̐sinappuḍe tanadami nāmīm̐da
valasinasoḍa nĕllā valabĕllā jalli vachchi
paliginappuḍe tanabatti nāmīm̐da
(||ībā||)
tinnavai vūrĕllānu tirugāḍivachchi nannum̐
gannappuḍe tana kāṁkṣhalĕllānu
sinnimadanamaṁtrālam̐ jikkivuṁḍi nāmām̐ṭalu
vinnappuḍe tanaveḍugĕllānu
(||ībā||)
vāḍalo sadulam̐ bŏṁdivachchi vāgām̐giḍilonam̐
gūḍi yippuḍesĕppī guṭṭu māgunu
yīḍavĕ śhrīveṁkaḍeśhum̐ḍiravai nāmomusūsi
vāḍigĕ nappuḍe sūbī vannĕ māgunu