ఈపాటివాఁడవు నీ కిఁకనేల వెఱపు
(॥పల్లవి॥)
ఈపాటివాఁడవు నీ కిఁకనేల వెఱపు
ఆ పనులకే నీవు ఆసపడేవు
(॥ఈపాటి॥)
తప్పక నిన్నుఁ జూచి తలపులో భావించి
చిప్పిలఁగఁ జెమరించేఁ జెలియ
ఇప్పుడు నీ వది చూచి యెగపోసి దిగపోసి
దప్పిదేరి వుస్సురంటాఁ దమకించేవు
(॥ఈపాటి॥)
నీచేయి పట్టుకొని నిలువునఁ గరఁగుచు
పూచినట్టు పులకించి బొలఁతి
ఆచాయలకే నీవు ఆసలెల్లాఁ బెడరేఁచి
తాచిక కళలతోనే దైవారేవు
(॥ఈపాటి॥)
మాటలు నీతో నాడి మచ్చికలఁదనివొంది
మేఁటికాఁగిలిచ్చీ నలమేలుమంగ
యీటున శ్రీవేంకటేశ ఇందుకే రతి మెప్పించి
సాటికి బేటికిఁ గడుసంతసిల్లేవు
(||pallavi||)
ībāḍivām̐ḍavu nī kim̐kanela vĕṟabu
ā panulage nīvu āsabaḍevu
(||ībāḍi||)
tappaga ninnum̐ jūsi talabulo bhāviṁchi
sippilam̐gam̐ jĕmariṁchem̐ jĕliya
ippuḍu nī vadi sūsi yĕgabosi digabosi
dappideri vussuraṁṭām̐ damagiṁchevu
(||ībāḍi||)
nīseyi paṭṭugŏni niluvunam̐ garam̐gusu
pūsinaṭṭu pulagiṁchi bŏlam̐ti
āsāyalage nīvu āsalĕllām̐ bĕḍarem̐si
tāsiga kaḽaladone daivārevu
(||ībāḍi||)
māḍalu nīdo nāḍi machchigalam̐danivŏṁdi
mem̐ṭigām̐gilichchī nalamelumaṁga
yīḍuna śhrīveṁkaḍeśha iṁduge radi mĕppiṁchi
sāḍigi beḍigim̐ gaḍusaṁtasillevu