ఈపాటివాఁడవు మాయింటికే రారాదా
(॥పల్లవి॥)
ఈపాటివాఁడవు మాయింటికే రారాదా
యేపొద్దూ నీ తమకమే యింతసేసీఁ గాక
(॥ఈపా॥)
సతులెల్లాఁ జూడఁగాను జారఁదీసేవు పయ్యద
రతికి వేళలేదా యీరవ్వ వలెనా
పతివైతేనేమి మాకుఁ బాటించవద్దా సిగ్గు
అతిజవ్వనము నిన్ను నాడించీఁగాక
(॥ఈపా॥)
కొలువులోపలనే సిగ్గులు మోవ మాటాడేవు
వలపు పచ్చిసేతురా వాసివలదా
యిలపై జాణండవై తేనేమి మాకు వద్దా గుట్టు
పెలుచుందనము నిన్ను పెడరేఁచీఁగాక
(॥ఈపా॥)
వూడిగము సేయఁగానే వొద్దికఁ గాఁగిలించేవు
యీడుజో డెఱఁగవద్దా యించుకైనాను
యీడనె శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
కూడితివి నీకరుణే గురిసేసీఁగాక
(||pallavi||)
ībāḍivām̐ḍavu māyiṁṭige rārādā
yebŏddū nī tamagame yiṁtasesīm̐ gāga
(||ībā||)
sadulĕllām̐ jūḍam̐gānu jāram̐dīsevu payyada
radigi veḽaledā yīravva valĕnā
padivaidenemi māgum̐ bāḍiṁchavaddā siggu
adijavvanamu ninnu nāḍiṁchīm̐gāga
(||ībā||)
kŏluvulobalane siggulu mova māḍāḍevu
valabu pachchisedurā vāsivaladā
yilabai jāṇaṁḍavai tenemi māgu vaddā guṭṭu
pĕlusuṁdanamu ninnu pĕḍarem̐sīm̐gāga
(||ībā||)
vūḍigamu seyam̐gāne vŏddigam̐ gām̐giliṁchevu
yīḍujo ḍĕṟam̐gavaddā yiṁchugainānu
yīḍanĕ śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
kūḍidivi nīgaruṇe gurisesīm̐gāga