ఈ వలవు నాకేయో యిందరికి నిట్లానే
(॥పల్లవి॥)
ఈ వలవు నాకేయో యిందరికి నిట్లానే
దైవము సేసిన మాయో తప్ప కిట్టె చెప్పరా
(॥ఈవ॥)
కన్నుల నిన్నుఁ జూచి కనురెప్ప వెట్టఁజాల
అన్నిటా సతులుఁ బతు లలిగే దెట్టో
సన్నపునవ్వులు నవ్వి చాలునని మానఁజాల
తిన్ననికాంతలు పతిఁ దిట్టే దెట్టో
(॥ఈవ॥)
మాటలాడి మాడలాడి మాట ముగిఇంచఁజాల
చాటువగా దంపతులు జంకించే దెట్టో
కూటపుకాఁగిట నించి కొంత వదలఁగఁడాల
మాటున తెరవేసేటిమంతనము లెట్టో
(॥ఈవ॥)
భావరతిఁ గడుఁజొక్కి పక్కనఁ దెలియఁజాల
మోవి గంటిసేతురనేమొక్కలు మెట్టో
వోవల శ్రీ వేంకటేశ వురమెక్కించితి నన్ను
వేవేలకు బొందులు వేరనఁగ నెట్టో
(||pallavi||)
ī valavu nāgeyo yiṁdarigi niṭlāne
daivamu sesina māyo tappa kiṭṭĕ sĕpparā
(||īva||)
kannula ninnum̐ jūsi kanurĕppa vĕṭṭam̐jāla
anniḍā sadulum̐ badu lalige dĕṭṭo
sannabunavvulu navvi sālunani mānam̐jāla
tinnanigāṁtalu padim̐ diṭṭe dĕṭṭo
(||īva||)
māḍalāḍi māḍalāḍi māḍa mugiiṁcham̐jāla
sāḍuvagā daṁpadulu jaṁkiṁche dĕṭṭo
kūḍabugām̐giḍa niṁchi kŏṁta vadalam̐gam̐ḍāla
māḍuna tĕraveseḍimaṁtanamu lĕṭṭo
(||īva||)
bhāvaradim̐ gaḍum̐jŏkki pakkanam̐ dĕliyam̐jāla
movi gaṁṭiseduranemŏkkalu mĕṭṭo
vovala śhrī veṁkaḍeśha vuramĕkkiṁchidi nannu
vevelagu bŏṁdulu veranam̐ga nĕṭṭo