Ee reedi naa valabulu yemtani seppudu neegu

ఈ రీతి నా వలపులు యెంతని చెప్పుదు నీకు
Language

(॥పల్లవి॥)
ఈ రీతి నా వలపులు యెంతని చెప్పుదు నీకు
కోరిన నా కోరికలు కొనసాగెనయ్యా

(॥ఈరీతి॥)
చెలికత్త లెల్లా నిన్నుఁ జెప్పఁగానే విని విని
వెలలేని వేడుకల విఱ్ఱవీఁగీని
కలువరేకులవంటి కన్నుల నిప్పుడు చూచి
తెలివితో నానందాన తెప్పలఁ దేలీని

(॥ఈరీతి॥)
వొద్దనుండి ఇంతవడి వూడిగాలు నీకుఁ జేసి
పొద్దులు వుచ్చుక కొంత భోగించీని
సుద్దులు నీతోఁ జెప్పి చుట్టరికాలు నెరపి
అద్దుక సరసమాడి ఆయము గరఁగితి

(॥ఈరీతి॥)
చిత్తమెరిఁగినదాఁకా సిగ్గువడి పానుపుపై
బత్తితో నీ కూటములు భావించుకొంటి
ఇత్తల శ్రీవేంకటేశ ఇట్టె నన్ను నేలితివి
నెత్తమాడి సంతోసాన నెమ్మది నవ్వితి

(||pallavi||)
ī rīdi nā valabulu yĕṁtani sĕppudu nīgu
korina nā korigalu kŏnasāgĕnayyā

(||īrīdi||)
sĕligatta lĕllā ninnum̐ jĕppam̐gāne vini vini
vĕlaleni veḍugala viṭravīm̐gīni
kaluvaregulavaṁṭi kannula nippuḍu sūsi
tĕlivido nānaṁdāna tĕppalam̐ delīni

(||īrīdi||)
vŏddanuṁḍi iṁtavaḍi vūḍigālu nīgum̐ jesi
pŏddulu vuchchuga kŏṁta bhogiṁchīni
suddulu nīdom̐ jĕppi suṭṭarigālu nĕrabi
adduga sarasamāḍi āyamu garam̐gidi

(||īrīdi||)
sittamĕrim̐ginadām̐kā sigguvaḍi pānububai
battido nī kūḍamulu bhāviṁchugŏṁṭi
ittala śhrīveṁkaḍeśha iṭṭĕ nannu nelidivi
nĕttamāḍi saṁtosāna nĕmmadi navvidi