ఈ మేటి తోఁబుట్టేనట మా యలమేలుమంగ
(॥పల్లవి॥)
ఈ మేటి తోఁబుట్టేనట మా యలమేలుమంగ
ఆ మేలే చూతురుగాని అవుఁ గాదనకురే
(॥ఈమే॥)
చూడరమ్మ అల్లవాఁడే చుక్కలరాజు
వేడుకలువెదచల్లే వెన్నెలరాశి
కూడపెట్టి దాఁచినట్టి కూడేటిబుద్ది
వోడక జలధిపాలి వుబ్బరిమందు ముద్ద
(॥ఈమే॥)
మెచ్చరే వాఁడె మరుని మేనమామ
మచ్చెముతోడి మఱ్ఱిమాని విత్తు
పచ్చిదేరే విరహపు పాముండే పుట్ట
కొచ్చి దేవతలపాలి గుజ్జనగూడు
(॥ఈమే॥)
యితఁడేసుండి శ్రీ వేంకటేశు మరఁది
తతిఁ బన్నీరూరే యమృతంపుఁ జలమ
సతులమోములఁ బోలేసరియలతి
గతి గూడిన పదారు కళల నిధానము
(||pallavi||)
ī meḍi tom̐buṭṭenaḍa mā yalamelumaṁga
ā mele sūdurugāni avum̐ gādanagure
(||īme||)
sūḍaramma allavām̐ḍe sukkalarāju
veḍugaluvĕdasalle vĕnnĕlarāśhi
kūḍabĕṭṭi dām̐sinaṭṭi kūḍeḍibuddi
voḍaga jaladhibāli vubbarimaṁdu mudda
(||īme||)
mĕchchare vām̐ḍĕ maruni menamāma
machchĕmudoḍi maṭrimāni vittu
pachchidere virahabu pāmuṁḍe puṭṭa
kŏchchi devadalabāli gujjanagūḍu
(||īme||)
yidam̐ḍesuṁḍi śhrī veṁkaḍeśhu maram̐di
tadim̐ bannīrūre yamṛtaṁpum̐ jalama
sadulamomulam̐ bolesariyaladi
gadi gūḍina padāru kaḽala nidhānamu