Ee gaali ee nela ee ooru selayeru

ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు
Year
Language

పల్లవి:

ఈ గాలి ఈ నేల.. ఈ ఊరు సెలయేరు
ఈ గాలి..ఈ.. ఈ నేల..ఆ.. ఈ ఊరు సెలయేరు
నను గన్న నా వాళ్ళు.. హా..ఆ..ఆ.. నా కళ్ళ లోగిళ్ళు
నను గన్న నా వాళ్ళు.. హా..ఆ..ఆ.. నా కళ్ళ లోగిళ్ళు

ఈ గాలి..ఈ.. ఈ నేల..

చరణం 1:

చిన్నారి గొరవ౦కా కూసేను ఆవ౦కా నా రాక తెలిసాక వచ్చేను నా వ౦కా
చిన్నారి గొరవ౦కా కూసేను ఆవ౦కా నా రాక తెలిసాక వచ్చేను నా వ౦కా
ఎన్నాళ్ళో గడిచాకా ఇన్నాళ్ళకు కలిసాక
ఎన్నాళ్ళో గడిచాకా ఇన్నాళ్ళకు కలిసాక
ఉప్పొ౦గిన గు౦డెల కేక ఎగసేను ని౦గి దాక
ఉప్పొ౦గిన గు౦డెల కేక ఎగసేను ని౦గి దాక
ఎగ్సేను.. నింగి దాక...ఆ..

ఈ గాలి..ఈ.. ఈ నేల..ఆ.. ఈ ఊరు సెలయేరు
నను గన్న నా వాళ్ళు.. ఆ..ఆ..ఆ.. నా కళ్ళ లీగిళ్ళు
ఈ గాలి..ఈ.. ఈ నేల..

చరణం 2:

ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలలు ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళలు
ఏనాడు ఏ శిల్పి..ఈ.. కన్నాడో ఈ కలలు ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళలు
ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథలు
ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథలు
ఈ రాళ్ళే జవరాళ్ళై ఇటనాట్యాలాడేను
ఈ రాళ్ళే జవరాళ్ళై ఇటనాట్యాలాడేను

చరణం 3:

కన్నె మూగ మనసు కన్న స్వర్ణ స్వప్నమై
తళుకుమన్న తార చిలుకు కా౦తి చినుకులై
కన్నె మూగ మనసు కన్న స్వర్ణ స్వప్నమై
తళుకుమన్న తార చిలుకు కా౦తి చినుకులై
గగన గళము ను౦డి అమర గానవాహిని .. ఆ..ఆ..ఆ..
గగన గళము ను౦డి అమర గానవాహిని
జాలువారుతో౦ది ఇలా అమృతవర్షిణి..ఈ.. అమృతవర్షిణి..ఈ అమృతవర్షిణీ..
ఈ స్వాతివానలో నా ఆత్మస్నానమాడే
నీ మురళిలో నా హృదయమే స్వరములుగా మారే..
ఆహాహ ఆహ ఆహ..
ఈ గాలి..ఈ.. ఈ నేల..ఆ.. ఈ ఊరు సెలయేరు
నను కన్న నా వాళ్ళు..ఊ.. నా కళ్ళ లోగిళ్ళు..ఊ..
ఈ గాలి..ఈ.. ఈ నేల..ఆ..

pallavi:

ī gāli ī nela.. ī ūru sĕlayeru
ī gāli..ī.. ī nela..ā.. ī ūru sĕlayeru
nanu ganna nā vāḽḽu.. hā..ā..ā.. nā kaḽḽa logiḽḽu
nanu ganna nā vāḽḽu.. hā..ā..ā.. nā kaḽḽa logiḽḽu

ī gāli..ī.. ī nela..

saraṇaṁ 1:

sinnāri gŏrava౦kā kūsenu āva౦kā nā rāga tĕlisāga vachchenu nā va౦kā
sinnāri gŏrava౦kā kūsenu āva౦kā nā rāga tĕlisāga vachchenu nā va౦kā
ĕnnāḽḽo gaḍisāgā innāḽḽagu kalisāga
ĕnnāḽḽo gaḍisāgā innāḽḽagu kalisāga
uppŏ౦gina gu౦ḍĕla kega ĕgasenu ni౦gi dāga
uppŏ౦gina gu౦ḍĕla kega ĕgasenu ni౦gi dāga
ĕgsenu.. niṁgi dāga...ā..

ī gāli..ī.. ī nela..ā.. ī ūru sĕlayeru
nanu ganna nā vāḽḽu.. ā..ā..ā.. nā kaḽḽa līgiḽḽu
ī gāli..ī.. ī nela..

saraṇaṁ 2:

enāḍu e śhilbi kannāḍo ī kalalu e ulido ī śhilabai nilibāḍo ī kaḽalu
enāḍu e śhilbi..ī.. kannāḍo ī kalalu e ulido ī śhilabai nilibāḍo ī kaḽalu
e valabula talabulado tĕlibāḍo ī kathalu
e valabula talabulado tĕlibāḍo ī kathalu
ī rāḽḽe javarāḽḽai iḍanāṭyālāḍenu
ī rāḽḽe javarāḽḽai iḍanāṭyālāḍenu

saraṇaṁ 3:

kannĕ mūga manasu kanna svarṇa svapnamai
taḽugumanna tāra silugu kā౦ti sinugulai
kannĕ mūga manasu kanna svarṇa svapnamai
taḽugumanna tāra silugu kā౦ti sinugulai
gagana gaḽamu nu౦ḍi amara gānavāhini .. ā..ā..ā..
gagana gaḽamu nu౦ḍi amara gānavāhini
jāluvārudo౦di ilā amṛtavarṣhiṇi..ī.. amṛtavarṣhiṇi..ī amṛtavarṣhiṇī..
ī svādivānalo nā ātmasnānamāḍe
nī muraḽilo nā hṛdayame svaramulugā māre..
āhāha āha āha..
ī gāli..ī.. ī nela..ā.. ī ūru sĕlayeru
nanu kanna nā vāḽḽu..ū.. nā kaḽḽa logiḽḽu..ū..
ī gāli..ī.. ī nela..ā..