Ee amdaanigi bamdham veshaanoganaadu

ఈ అందానికి బంధం వేశానొకనాడు
Year
Language

పల్లవి:

ఈ అందానికి బంధం వేశానొకనాడు
ఆ బంధమే నాకందమైనది ఈ నాడు

ఈ అందానికి బంధం వేశానొకనాడు
ఆ బంధమే నాకందమైనది ఈ నాడు

చరణం 1:

నీ కళ్ళు ఆనాడు ఎరుపెక్కెను... నేడు ఆ ఎరుపె నీ బుగ్గపై పాకెను
ఊహూ ఊహూ హూ హూ హూ
నీ కళ్ళు ఆనాడు ఎరుపెక్కెను... నేడు ఆ ఎరుపె నీ బుగ్గపై పాకెను
నీ చేతులానాడు చెరలాయెను ...నేడు ఆ చెరలె కౌగిలై పెనవేసెను...
ఊహూ ఊహూ హూ హూ హూ

ఈ అందానికి బంధం వేసానొకనాడు...
ఆ బంధమే నాకందమైనది ...ఈ నాడు

చరణం 2:

నీ వేడిలోనే నా చలువ ఉందని వాన ఎండను చేరింది
నీ చలువే నా వేడికి విలువని ఎండే వానను మెచ్చింది
నీ వేడిలోనే నా చలువ ఉందని వాన ఎండను చేరింది
నీ చలువే నా వేడికి విలువని ఎండే వానను మెచ్చింది

ఇద్దరు కలిసిన ఆ ఒద్దికలో ఇంధ్రధనస్సే విరిసింది
ఏడు రంగుల ముగ్గులు వేసి ...నింగీ నేలను కలిపింది
ప్రేమకు పెళ్ళే చేసింది ...

ఈ అందానికి బంధం వేసానొకనాడు
ఆ బంధమే నాకందమైనది ...ఈ నాడు

ఆహాహా ఆహాహా... ఆహాహా ఆహాహా
ఆహాహా ఆహాహా.... ఆహాహా ఆహాహా
ఆహాహా ఆహాహా.... ఆహాహా ఆహాహా

pallavi:

ī aṁdānigi baṁdhaṁ veśhānŏganāḍu
ā baṁdhame nāgaṁdamainadi ī nāḍu

ī aṁdānigi baṁdhaṁ veśhānŏganāḍu
ā baṁdhame nāgaṁdamainadi ī nāḍu

saraṇaṁ 1:

nī kaḽḽu ānāḍu ĕrubĕkkĕnu... neḍu ā ĕrubĕ nī buggabai pāgĕnu
ūhū ūhū hū hū hū
nī kaḽḽu ānāḍu ĕrubĕkkĕnu... neḍu ā ĕrubĕ nī buggabai pāgĕnu
nī sedulānāḍu sĕralāyĕnu ...neḍu ā sĕralĕ kaugilai pĕnavesĕnu...
ūhū ūhū hū hū hū

ī aṁdānigi baṁdhaṁ vesānŏganāḍu...
ā baṁdhame nāgaṁdamainadi ...ī nāḍu

saraṇaṁ 2:

nī veḍilone nā saluva uṁdani vāna ĕṁḍanu seriṁdi
nī saluve nā veḍigi viluvani ĕṁḍe vānanu mĕchchiṁdi
nī veḍilone nā saluva uṁdani vāna ĕṁḍanu seriṁdi
nī saluve nā veḍigi viluvani ĕṁḍe vānanu mĕchchiṁdi

iddaru kalisina ā ŏddigalo iṁdhradhanasse virisiṁdi
eḍu raṁgula muggulu vesi ...niṁgī nelanu kalibiṁdi
premagu pĕḽḽe sesiṁdi ...

ī aṁdānigi baṁdhaṁ vesānŏganāḍu
ā baṁdhame nāgaṁdamainadi ...ī nāḍu

āhāhā āhāhā... āhāhā āhāhā
āhāhā āhāhā.... āhāhā āhāhā
āhāhā āhāhā.... āhāhā āhāhā