Eduvamtivaamdavu imta pomdainasoda

ఎటువంటివాఁడవు ఇంత పొందైనచోట
Language

(॥పల్లవి॥)
ఎటువంటివాఁడవు ఇంత పొందైనచోట
తటుకనఁ బైకొనక తడవులు సేతురా

(॥ఎటు॥)
పడఁతి చెక్కులదాఁకా పయ్యదగప్పుకొంటా
పెడరేఁచి ఇంటిదాఁకాఁ బిలిచె నిన్ను
వుడివోనిజవ్వనాన నూరకే మలసుకొంటా
వొడివట్టి తియ్యఁగాను వోపనందురా

(॥ఎటు॥)
ఇరవైనఆసలతో నెప్పుడు వత్తువోయంటా
సురటి మాఁటువెట్టుక చూచీ నిన్ను
మురిసేన నీతోను ముద్దుల గురుసుకొంటా
గరిమ సన్నసేయఁగా గక్కన బిగుతురా

(॥ఎటు॥)
సారెసారె మోవితేనేచవులు చూపుకొఁటా
నేరుపుతోఁ గాఁగిట నించీ నిన్ను
యీరీతి శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
చేరి యెదురు చూడఁగా సిగ్గున నవ్వుదురా

(||pallavi||)
ĕḍuvaṁṭivām̐ḍavu iṁta pŏṁdainasoḍa
taḍuganam̐ baigŏnaga taḍavulu sedurā

(||ĕḍu||)
paḍam̐ti sĕkkuladām̐kā payyadagappugŏṁṭā
pĕḍarem̐si iṁṭidām̐kām̐ bilisĕ ninnu
vuḍivonijavvanāna nūrage malasugŏṁṭā
vŏḍivaṭṭi tiyyam̐gānu vobanaṁdurā

(||ĕḍu||)
iravainaāsalado nĕppuḍu vattuvoyaṁṭā
suraḍi mām̐ṭuvĕṭṭuga sūsī ninnu
murisena nīdonu muddula gurusugŏṁṭā
garima sannaseyam̐gā gakkana bigudurā

(||ĕḍu||)
sārĕsārĕ movidenesavulu sūbugŏm̐ṭā
nerubudom̐ gām̐giḍa niṁchī ninnu
yīrīdi śhrīveṁkaḍeśha yīgĕ yalamelumaṁga
seri yĕduru sūḍam̐gā sigguna navvudurā