(॥పల్లవి॥)
ఎటువంటివాఁడవయ్యా యేమయ్యా
తటుకన మొక్కితేను తలవంచేవు
(॥ఎటు॥)
కొసరితే దోసమా కూరిమి గలుగుసతి
యెసగ సాదించేవుఇందరిలోన
వునురనఁదగదా వుడివోని విరహాన
కసుగాటు మాటల గరిసించేవు
(॥ఎటు॥)
చెనకఁగరాదా చేతికిలోనైనయాపె
పనివడి జంకించేవు పంతమాడుతా
తనిసి యలయరాదా తమకపుఁగాఁకలకు
పెనఁగుచు బీరానఁ బెచ్చురేఁగేవు
(॥ఎటు॥)
అలమితే నేమాయ అలమేలుమంగ నిన్ను
చలరేఁగి గుంపించేవు శ్రీవేంకటేశ
తలపోయవలదా తగిలినరతులను
పలుసోఁకులనుఁ గడుఁ బచ్చి సేసేవు
(||pallavi||)
ĕḍuvaṁṭivām̐ḍavayyā yemayyā
taḍugana mŏkkidenu talavaṁchevu
(||ĕḍu||)
kŏsaride dosamā kūrimi galugusadi
yĕsaga sādiṁchevuiṁdarilona
vunuranam̐dagadā vuḍivoni virahāna
kasugāḍu māḍala garisiṁchevu
(||ĕḍu||)
sĕnagam̐garādā sedigilonainayābĕ
panivaḍi jaṁkiṁchevu paṁtamāḍudā
tanisi yalayarādā tamagabum̐gām̐kalagu
pĕnam̐gusu bīrānam̐ bĕchchurem̐gevu
(||ĕḍu||)
alamide nemāya alamelumaṁga ninnu
salarem̐gi guṁpiṁchevu śhrīveṁkaḍeśha
talaboyavaladā tagilinaradulanu
palusom̐kulanum̐ gaḍum̐ bachchi sesevu