Eduvamtivaamdavaidi vemayyaa neevu

ఎటువంటివాఁడవైతి వేమయ్యా నీవు
Language

(॥పల్లవి॥)
ఎటువంటివాఁడవైతి వేమయ్యా నీవు
తటుకన నాఁడువారి దయఁజూడవలదా

(॥ఎటు॥)
మంతనావ నే నీతో మచ్చికమాటలాడితే
కాంతలతోఁ జెప్పి చెప్పి కాకుసేతురా
వింతలుగా నిన్నుఁ జేరి వేడుకనవ్వు నవ్వితే
అంతలోనే మాచేఁత లంగడిఁ బెట్టుదురా

(॥ఎటు॥)
చనవుతో నీకు నేను సన్నలు సేసితేను
వనితలకు జూపి రవ్వులు సేతురా
వినయాన సరసము వెరవక నే నాడితే
వెనకొని మా గుట్టు వెల్లవిరి సేతురా

(॥ఎటు॥)
కామించి నిన్ను నేనుఁ గాఁగిలించుకొంటేను
భామలకు నెచ్చరించి పచ్చి సేతురా
గోమున శ్రీవేంకటేశ కూడి మొక్కించుకొంటివి
ఆముకొన్న నావలపు లారడిఁ బెట్టుదురా

(||pallavi||)
ĕḍuvaṁṭivām̐ḍavaidi vemayyā nīvu
taḍugana nām̐ḍuvāri dayam̐jūḍavaladā

(||ĕḍu||)
maṁtanāva ne nīdo machchigamāḍalāḍide
kāṁtaladom̐ jĕppi sĕppi kāgusedurā
viṁtalugā ninnum̐ jeri veḍuganavvu navvide
aṁtalone māsem̐ta laṁgaḍim̐ bĕṭṭudurā

(||ĕḍu||)
sanavudo nīgu nenu sannalu sesidenu
vanidalagu jūbi ravvulu sedurā
vinayāna sarasamu vĕravaga ne nāḍide
vĕnagŏni mā guṭṭu vĕllaviri sedurā

(||ĕḍu||)
kāmiṁchi ninnu nenum̐ gām̐giliṁchugŏṁṭenu
bhāmalagu nĕchchariṁchi pachchi sedurā
gomuna śhrīveṁkaḍeśha kūḍi mŏkkiṁchugŏṁṭivi
āmugŏnna nāvalabu lāraḍim̐ bĕṭṭudurā