Eduvamtidaanave yennadige mogamoda

ఎటువంటిదానవే యెన్నటికే మొగమోట
Language

(॥పల్లవి॥)
ఎటువంటిదానవే యెన్నటికే మొగమోట
పటుగతి నీ కతఁడు పంతమియ్యఁగాను

(॥ఎటు॥)
తలవంచనేమిటికే తరుణి నీనాయకుఁడు
పిలిచి నీచేయివట్టి పెనఁగఁగాను
చలము లింకా మరియు సాదించనేమిటికె
వెలలేనివేడుకల వేఁడుకొనఁగాను

(॥ఎటు॥)
చింతించ నేమిటికె చెక్కు చేతనుఁజేర్చి
సొంత నాతఁడు నిన్నుఁ బొదుగఁగాను
ఇంత బిగువేమిటికే యెదుటనే నిలుచుండి
మంతనమున నినను మన్నించఁగాను

(॥ఎటు॥)
సిగ్గులివి యేమిటికే శ్రీవేంకటేశ్వరుఁడు
అగ్గమై కాఁగిటనే అలమఁగాను
యెగ్గు లేమిటికే నేఁ డిచట సంతోసముతో
వెగ్గళపురతులలో వెలయించఁగాను

(||pallavi||)
ĕḍuvaṁṭidānave yĕnnaḍige mŏgamoḍa
paḍugadi nī kadam̐ḍu paṁtamiyyam̐gānu

(||ĕḍu||)
talavaṁchanemiḍige taruṇi nīnāyagum̐ḍu
pilisi nīseyivaṭṭi pĕnam̐gam̐gānu
salamu liṁkā mariyu sādiṁchanemiḍigĕ
vĕlaleniveḍugala vem̐ḍugŏnam̐gānu

(||ĕḍu||)
siṁtiṁcha nemiḍigĕ sĕkku sedanum̐jersi
sŏṁta nādam̐ḍu ninnum̐ bŏdugam̐gānu
iṁta biguvemiḍige yĕduḍane nilusuṁḍi
maṁtanamuna ninanu manniṁcham̐gānu

(||ĕḍu||)
siggulivi yemiḍige śhrīveṁkaḍeśhvarum̐ḍu
aggamai kām̐giḍane alamam̐gānu
yĕggu lemiḍige nem̐ ḍisaḍa saṁtosamudo
vĕggaḽaburadulalo vĕlayiṁcham̐gānu