ఎటువంటి నీపై బత్తో యీకెకు నేఁడు
(॥పల్లవి॥)
ఎటువంటి నీపై బత్తో యీకెకు నేఁడు
తటుకన నీ సుద్దుల తాలిమిఁ బొందీని
(॥ఎటు॥)
సెలవుల నవ్వు నవ్వి చేతులు నీపైఁ జాఁచి
తలపోఁతలనే కడుఁదనివందీని
పిలుపుల నొకకొంత పెనఁగులాటలఁ గొంత
చెలరేఁగి తనుఁదానె సేదదేరీని
(॥ఎటు॥)
అనువుగా మాటలాడి అండ నిట్టె కూచుండి
మనసులో తమకము మందలించీని
వినయపు సేవచేత వేమారు సన్నలచేత
నినుపు సంతోసాలు నించుకొనీని
(॥ఎటు॥)
సూటిగా నీమోము చూచి సొమ్ములు చేతఁ దడవి
వాఁటపు విరహమెల్లా వారించీని
యీటున శ్రీ వేంకటేశ యింతి నిట్టె యేలితివి
తాటించి నీరతులను దైవారీని
(||pallavi||)
ĕḍuvaṁṭi nībai batto yīgĕgu nem̐ḍu
taḍugana nī suddula tālimim̐ bŏṁdīni
(||ĕḍu||)
sĕlavula navvu navvi sedulu nībaim̐ jām̐si
talabom̐talane kaḍum̐danivaṁdīni
pilubula nŏgagŏṁta pĕnam̐gulāḍalam̐ gŏṁta
sĕlarem̐gi tanum̐dānĕ sedaderīni
(||ĕḍu||)
anuvugā māḍalāḍi aṁḍa niṭṭĕ kūsuṁḍi
manasulo tamagamu maṁdaliṁchīni
vinayabu sevaseda vemāru sannalaseda
ninubu saṁtosālu niṁchugŏnīni
(||ĕḍu||)
sūḍigā nīmomu sūsi sŏmmulu sedam̐ daḍavi
vām̐ṭabu virahamĕllā vāriṁchīni
yīḍuna śhrī veṁkaḍeśha yiṁti niṭṭĕ yelidivi
tāḍiṁchi nīradulanu daivārīni