Eduvalem bogadinaa ninnidigim daginadi

ఎటువలెఁ బొగడినా నిన్నిటికిఁ దగినది
Language

(॥పల్లవి॥)
ఎటువలెఁ బొగడినా నిన్నిటికిఁ దగినది
ఘటిఇంచె మేలుమేలు కంటిమి యీవేడుక

(॥ఎటు॥)
చెలిచన్నులబలిమి సింగారానకుఁ గలిమి
అలరుఁగన్నులచూపు ఆసలదాపు
నిలువయిక్కఁదనము నెమ్మి దాఁచినధనము
కులుకుఁగుత్తికసొంపు కోవిలలగుంపు

(॥ఎటు॥)
కాంతవెట్టినకొప్పు గండుదుమ్మిదలకప్పు
చెంత నెన్నడిమికీలు సింగముఁ బోలు
యెంతే పిఱుఁదుతీరు ఇంచువిలుతునితేరు
వింతచిరునవ్వులాగు వెన్నెలపోగు

(॥ఎటు॥)
లేమపాదములసోగ లేఁతచిగురులో చేఁగ
భూమిలో మించె యీయమ్మ పుత్తడిబొమ్మ
ఆముక శ్రీవేంకటేశ అలమేల్మంగపతివి
ప్రేమ నేలితివి పొందు బెరసినవిందు

(||pallavi||)
ĕḍuvalĕm̐ bŏgaḍinā ninniḍigim̐ daginadi
ghaḍiiṁchĕ melumelu kaṁṭimi yīveḍuga

(||ĕḍu||)
sĕlisannulabalimi siṁgārānagum̐ galimi
alarum̐gannulasūbu āsaladābu
niluvayikkam̐danamu nĕmmi dām̐sinadhanamu
kulugum̐guttigasŏṁpu kovilalaguṁpu

(||ĕḍu||)
kāṁtavĕṭṭinagŏppu gaṁḍudummidalagappu
sĕṁta nĕnnaḍimigīlu siṁgamum̐ bolu
yĕṁte piṟum̐dudīru iṁchuviludunideru
viṁtasirunavvulāgu vĕnnĕlabogu

(||ĕḍu||)
lemabādamulasoga lem̐tasigurulo sem̐ga
bhūmilo miṁchĕ yīyamma puttaḍibŏmma
āmuga śhrīveṁkaḍeśha alamelmaṁgabadivi
prema nelidivi pŏṁdu bĕrasinaviṁdu