Edurubadi vunnaaru iddaru meeru

ఎదురుబడి వున్నారు ఇద్దరు మీరు
Language

(॥పల్లవి॥)
ఎదురుబడి వున్నారు ఇద్దరు మీరు
సుదతి భావము లెంచి చూచుకొనవయ్యా

(॥ఎదు॥)
చెక్కునఁ జేఇ మాటుచేసి చిమ్ముఁజూపులనుఁజూచి
చొక్కీఁ దనలోఁదానే సుదతి
ముక్కర గదలఁగాను ముచ్చటాడి చెలికిని
దిక్కు చూపీఁ గమ్మటిని తెలుసుకోవయ్యా

(॥ఎదు॥)
బలువుగాఁ గొప్పువెట్టి పాపట దువ్వుకొంటాను
కొలువు సేసీ నీకుఁ గోమలి
పలువరుస మెరువఁ బదాలు నీపైఁ బాడి
కలువల నిన్ను వేసీఁ గనుకొనవయ్యా

(॥ఎదు॥)
పరగ నొత్తిలి నీ పాదముపైఁ జేయి చాఁచి
మరుకేలి నిన్నుఁ గూడి మగువ
నిరతి శ్రీ వేంకటేశ నీకిదె కానుకలిచ్చీ
సరిఁ దన చన్ను లివె సారె మెచ్చవయ్యా

(||pallavi||)
ĕdurubaḍi vunnāru iddaru mīru
sudadi bhāvamu lĕṁchi sūsugŏnavayyā

(||ĕdu||)
sĕkkunam̐ jei māḍusesi simmum̐jūbulanum̐jūsi
sŏkkīm̐ danalom̐dāne sudadi
mukkara gadalam̐gānu muchchaḍāḍi sĕligini
dikku sūbīm̐ gammaḍini tĕlusugovayyā

(||ĕdu||)
baluvugām̐ gŏppuvĕṭṭi pābaḍa duvvugŏṁṭānu
kŏluvu sesī nīgum̐ gomali
paluvarusa mĕruvam̐ badālu nībaim̐ bāḍi
kaluvala ninnu vesīm̐ ganugŏnavayyā

(||ĕdu||)
paraga nŏttili nī pādamubaim̐ jeyi sām̐si
marugeli ninnum̐ gūḍi maguva
niradi śhrī veṁkaḍeśha nīgidĕ kānugalichchī
sarim̐ dana sannu livĕ sārĕ mĕchchavayyā