Eduraidi middaramu yimkanemtide

ఎదురైతి మిద్దరము యిఁకనేఁటిదే
Language

(॥పల్లవి॥)
ఎదురైతి మిద్దరము యిఁకనేఁటిదే
పదిమారులు దూరఁబనిలే దనరే

(॥ఎదు॥)
నెట్టన నీళ్ళపైవ్రాఁత నిజమా సరసాలు
వట్టిమోపు లింత గట్టవద్దనరే
దట్టముగ వట్టిజోలి దవ్వుకొనవద్దనరే
గుట్టుచేసి సందెకాడ గుంపించకుమనరే

(॥ఎదు॥)
మిక్కిలియటమటాల మేను వెంచవద్దనరే
పక్కున దారామోనఁ జూపకుమనరే
గక్కన చేఁతల ఱాయి గరఁగించవద్దనరే
దక్కనిదొంగగుణాలు తగవుగాదనరే

(॥ఎదు॥)
యేడలేనిబుద్దులకు యెడములేదనరే
వేడుకపరువులేల్లా విడుమనరే
యీడనే శ్రీవేంకటేశు డింత సేసి నన్ను గూడె
యీడు జోడై యివి యెన్ని కాయననరే

(||pallavi||)
ĕduraidi middaramu yim̐kanem̐ṭide
padimārulu dūram̐banile danare

(||ĕdu||)
nĕṭṭana nīḽḽabaivrām̐ta nijamā sarasālu
vaṭṭimobu liṁta gaṭṭavaddanare
daṭṭamuga vaṭṭijoli davvugŏnavaddanare
guṭṭusesi saṁdĕgāḍa guṁpiṁchagumanare

(||ĕdu||)
mikkiliyaḍamaḍāla menu vĕṁchavaddanare
pakkuna dārāmonam̐ jūbagumanare
gakkana sem̐tala ṟāyi garam̐giṁchavaddanare
dakkanidŏṁgaguṇālu tagavugādanare

(||ĕdu||)
yeḍalenibuddulagu yĕḍamuledanare
veḍugabaruvulellā viḍumanare
yīḍane śhrīveṁkaḍeśhu ḍiṁta sesi nannu gūḍĕ
yīḍu joḍai yivi yĕnni kāyananare