Eduraidi middaramu nemamdunu

ఎదురైతి మిద్దరము నేమందును
Language

(॥పల్లవి॥)
ఎదురైతి మిద్దరము నేమందును
యెదలో నున్నది వల పేమందును

(॥ఎదు॥)
నన్ను నేనే చూచుకొని నా విరహ మెంచుకొని
ఇన్నిటా జాణవు నిన్ను నేమందును
సన్నలేమి సేసేవు చవులేమి చూపేవు
మన్నన సతిని యిఁక మరియు నేమందును

(॥ఎదు॥)
మునుపే వొడఁబాటులు మొగమోటము లిప్పుడు
యినుమడించె నీ నవ్వు లేమందును
తనివి లేదు నీకైతే తమకమే తఱచాయ
పెనఁగేటిదానఁ గాను పిలిచి యేమందును

(॥ఎదు॥)
పరపు పైఁ గూచుండి భావమెల్లాఁ జేకొని
ఇరవైన నీతోను యేమందును
గరిమ శ్రీ వేంకటేశ కలసితి విటు నన్ను
వొరసితి నన్నిటాను వూరకే యేమందును

(||pallavi||)
ĕduraidi middaramu nemaṁdunu
yĕdalo nunnadi vala pemaṁdunu

(||ĕdu||)
nannu nene sūsugŏni nā viraha mĕṁchugŏni
inniḍā jāṇavu ninnu nemaṁdunu
sannalemi sesevu savulemi sūbevu
mannana sadini yim̐ka mariyu nemaṁdunu

(||ĕdu||)
munube vŏḍam̐bāḍulu mŏgamoḍamu lippuḍu
yinumaḍiṁchĕ nī navvu lemaṁdunu
tanivi ledu nīgaide tamagame taṟasāya
pĕnam̐geḍidānam̐ gānu pilisi yemaṁdunu

(||ĕdu||)
parabu paim̐ gūsuṁḍi bhāvamĕllām̐ jegŏni
iravaina nīdonu yemaṁdunu
garima śhrī veṁkaḍeśha kalasidi viḍu nannu
vŏrasidi nanniḍānu vūrage yemaṁdunu