Edudane vunnavaamdu yela mammu gelisesee

ఎదుటనే వున్నవాఁడు యేల మమ్ము గేలిసేసీ
Language

(॥పల్లవి॥)
ఎదుటనే వున్నవాఁడు యేల మమ్ము గేలిసేసీ
అదను వదనుఁ గూడ నడుగరే యతని

(॥ఎదు॥)
తలఁపులోపలిమాట తానే యెరుఁగుఁగాక
యెలమి మమ్మడిగితే నేమనేమే
తలఁపు గొల్లెతలెల్లా తగఁ బంచుకొన్నారు
అలి మిగులఁగద్దాఅడుగరే యతని

(॥ఎదు॥)
కతన నవ్వినట్టినవ్వు తానే యెరుఁగుఁగాక
యెనసి మమ్మడిగితే నేమనేమే
తననవ్వు మధురలో తరుణు లందుకొనిరి
అనువై మిగులఁ గద్దా అడుగరే యతని

(॥ఎదు॥)
శ్రీవేంకటేశుఁడు తనచేఁత తానే యెరుఁగుఁగాక
యీవల మమ్మడిగితే నేమనేమే
సేవఁ దనకాఁగిలి చేరి నేనే కైకొంటి
ఆవల మిగులఁ గద్దా అడుగరే యతని

(||pallavi||)
ĕduḍane vunnavām̐ḍu yela mammu gelisesī
adanu vadanum̐ gūḍa naḍugare yadani

(||ĕdu||)
talam̐pulobalimāḍa tāne yĕrum̐gum̐gāga
yĕlami mammaḍigide nemaneme
talam̐pu gŏllĕdalĕllā tagam̐ baṁchugŏnnāru
ali migulam̐gaddāaḍugare yadani

(||ĕdu||)
kadana navvinaṭṭinavvu tāne yĕrum̐gum̐gāga
yĕnasi mammaḍigide nemaneme
tananavvu madhuralo taruṇu laṁdugŏniri
anuvai migulam̐ gaddā aḍugare yadani

(||ĕdu||)
śhrīveṁkaḍeśhum̐ḍu tanasem̐ta tāne yĕrum̐gum̐gāga
yīvala mammaḍigide nemaneme
sevam̐ danagām̐gili seri nene kaigŏṁṭi
āvala migulam̐ gaddā aḍugare yadani