ఎదుటనే వున్నఁదాన యెంత దడవే
(॥పల్లవి॥)
ఎదుటనే వున్నఁదాన యెంత దడవే
అదను చూచే నింతే అందుకెంత దడవే
(॥ఎదు॥)
జోకతో నొకట రెంటఁ జూచి వోర్చేఁగాక వాని-
కీకడిమోము సేసుకో నెంతదడవే
సాకిరివెట్టినదాఁకా చవి సేసుకోంటఁగాక
మైకొని తెగనాడేది మరి యెంతదడవే
(॥ఎదు॥)
మిమ్మెల్ల మెచ్చుదాఁకా మీరఁగాక తనమీఁద
ఇమ్ముల నేరాలువేయ నెంతదడవే
నమ్మికలిచ్చేనతననాటకాలు చూచేఁగాక
చిమ్ముల చేఁతకుఁ జేఁత సేయ నెంతదడవే
(॥ఎదు॥)
మగవాఁడు, తనమీఁదిమచ్చెములు చూచేఁగాక
యెదసక్కేలకు నవ్వ నెంతదడవే
తగుశ్రీవేంకటపతి తా నన్నుఁ గూడఁగఁగాక
నిగిడి నేఁ గాఁగిటిలో నించ నెంతదడవే
(||pallavi||)
ĕduḍane vunnam̐dāna yĕṁta daḍave
adanu sūse niṁte aṁdugĕṁta daḍave
(||ĕdu||)
jogado nŏgaḍa rĕṁṭam̐ jūsi vorsem̐gāga vāni-
kīgaḍimomu sesugo nĕṁtadaḍave
sāgirivĕṭṭinadām̐kā savi sesugoṁṭam̐gāga
maigŏni tĕganāḍedi mari yĕṁtadaḍave
(||ĕdu||)
mimmĕlla mĕchchudām̐kā mīram̐gāga tanamīm̐da
immula nerāluveya nĕṁtadaḍave
nammigalichchenadananāḍagālu sūsem̐gāga
simmula sem̐tagum̐ jem̐ta seya nĕṁtadaḍave
(||ĕdu||)
magavām̐ḍu, tanamīm̐dimachchĕmulu sūsem̐gāga
yĕdasakkelagu navva nĕṁtadaḍave
taguśhrīveṁkaḍabadi tā nannum̐ gūḍam̐gam̐gāga
nigiḍi nem̐ gām̐giḍilo niṁcha nĕṁtadaḍave