Edudane vumdamgaanu yedamaamta lemidige

ఎదుటనే వుండఁగాను యెడమాఁట లేమిటికే
Language

(॥పల్లవి॥)
ఎదుటనే వుండఁగాను యెడమాఁట లేమిటికే
కదిసి పెనఁగులాడే కలయికలే మేలే

(॥ఎదు॥)
మచ్చికలు నెరపితే మనసు లేకము లౌను
ఇచ్చకము తెచ్చితేనే యింపులు వుట్టు
ముచ్చటలు గలసితే ముదురు నడియాసలు
మెచ్చులుగా బతితోడి మేలములే మేలే

(॥ఎదు॥)
నగవు లుప్పతిలితే ననుపులు సమకూడు
మొగమాట గలిగితే మొనయు దమి
తగులాయా లొనరితే దట్టమౌను వలపులు
మగవానితో మంచిమాటలే మేలే

(॥ఎదు॥)
చూపులు తారసించే సొంపులు మిక్కుటమౌను
కాఁపురాలు దొరకితే గట్టియౌఁ బొందు
పైపై నీమీఁది బత్తిఁ బాయక నన్నేలినాఁడు
చేపట్టి శ్రీవేంకటేశు సేవలే మేలే

(||pallavi||)
ĕduḍane vuṁḍam̐gānu yĕḍamām̐ṭa lemiḍige
kadisi pĕnam̐gulāḍe kalayigale mele

(||ĕdu||)
machchigalu nĕrabide manasu legamu launu
ichchagamu tĕchchidene yiṁpulu vuṭṭu
muchchaḍalu galaside muduru naḍiyāsalu
mĕchchulugā badidoḍi melamule mele

(||ĕdu||)
nagavu luppadilide nanubulu samagūḍu
mŏgamāḍa galigide mŏnayu dami
tagulāyā lŏnaride daṭṭamaunu valabulu
magavānido maṁchimāḍale mele

(||ĕdu||)
sūbulu tārasiṁche sŏṁpulu mikkuḍamaunu
kām̐purālu dŏragide gaṭṭiyaum̐ bŏṁdu
paibai nīmīm̐di battim̐ bāyaga nannelinām̐ḍu
sebaṭṭi śhrīveṁkaḍeśhu sevale mele