ఎదుట నుండవే నీవు యేపొద్దును
(॥పల్లవి॥)
ఎదుట నుండవే నీవు యేపొద్దును
అదివో మేలువాఁడైనాఁ డతఁడు నీకిపుడు
(॥ఎదు॥)
తేనెలు గారేటి నీతేటలమాటలు వింటె
వీనులపండుగలౌను విభునికిని
కానుకగా నీవు చక్కనిమోము చూపితేను
వూనినమదనకళ లుప్పోంగు నాతనికి
(॥ఎదు॥)
నీలపుసరాలవంటినీచూపులు సొఁకితేను
చాలా సంతోషమౌ నీసరసునికి
చాలుకోన సెలవుల సన్నపునవ్వు నవ్వితే
తాలిమితో వేడుకలు దట్టమౌ నాతనికి
(॥ఎదు॥)
మెఱుఁగుగుబ్బల నీవు మేను సోఁకఁజేసీతేను
కఱఁగు జిత్తము శ్రీవేంకటేశ్వరుకు
గుఱియై యలమేల్‌మంగ కూడితి విన్నిటా నీకు
నెఱి నీపై కోరికలే నెగడు నాతనికి
(||pallavi||)
ĕduḍa nuṁḍave nīvu yebŏddunu
adivo meluvām̐ḍainām̐ ḍadam̐ḍu nīgibuḍu
(||ĕdu||)
tenĕlu gāreḍi nīdeḍalamāḍalu viṁṭĕ
vīnulabaṁḍugalaunu vibhunigini
kānugagā nīvu sakkanimomu sūbidenu
vūninamadanagaḽa luppoṁgu nādanigi
(||ĕdu||)
nīlabusarālavaṁṭinīsūbulu sŏm̐kidenu
sālā saṁtoṣhamau nīsarasunigi
sālugona sĕlavula sannabunavvu navvide
tālimido veḍugalu daṭṭamau nādanigi
(||ĕdu||)
mĕṟum̐gugubbala nīvu menu som̐kam̐jesīdenu
kaṟam̐gu jittamu śhrīveṁkaḍeśhvarugu
guṟiyai yalamelmaṁga kūḍidi vinniḍā nīgu
nĕṟi nībai korigale nĕgaḍu nādanigi