ఎదుట నేనుండఁగా నీవేల కొంకేవు
(॥పల్లవి॥)
ఎదుట నేనుండఁగా నీవేల కొంకేవు
గుదిగొన్న వలపులు కుమ్మరించఁగదవే
(॥ఎదు॥)
రవళి నల్లంత నీవు రాఁగా విభుఁడు నీకు
చెవులోగ్గీ విన్నపాలు సేయఁగదవే
తివిరి నీవొడిదిక్కే తేరకొనఁజూచీని
వువిద, కానుకేమైనా నుంటే నియ్యఁగదవే
(॥ఎదు॥)
పొద్దున వచ్చి నీవు పొంచి నిలుచుండఁగాను
వొద్దఁ జోటిచ్చీ నీకుఁ గూచుండఁగదవే
కొద్దిమీర మోముచూచి గుక్కిళ్లతో నోరూరీని
చద్దికివేడిఁక మోవి చవిచూపఁగదవే
(॥ఎదు॥)
తోలుతే బాగాలు నీవు దొసిటఁ బట్టుకుండఁగ
యెలమిఁ జెయిచాఁచీ నందియ్యఁగదవే
అలమేల్‌మంగపతియైన శ్రీవేంకటేశుఁడు
నెలకొని నన్నునేలె నీవూఁ గూడఁగదవే
(||pallavi||)
ĕduḍa nenuṁḍam̐gā nīvela kŏṁkevu
gudigŏnna valabulu kummariṁcham̐gadave
(||ĕdu||)
ravaḽi nallaṁta nīvu rām̐gā vibhum̐ḍu nīgu
sĕvuloggī vinnabālu seyam̐gadave
tiviri nīvŏḍidikke teragŏnam̐jūsīni
vuvida, kānugemainā nuṁṭe niyyam̐gadave
(||ĕdu||)
pŏdduna vachchi nīvu pŏṁchi nilusuṁḍam̐gānu
vŏddam̐ joḍichchī nīgum̐ gūsuṁḍam̐gadave
kŏddimīra momusūsi gukkiḽlado norūrīni
saddigiveḍim̐ka movi savisūbam̐gadave
(||ĕdu||)
tolude bāgālu nīvu dŏsiḍam̐ baṭṭuguṁḍam̐ga
yĕlamim̐ jĕyisām̐sī naṁdiyyam̐gadave
alamelmaṁgabadiyaina śhrīveṁkaḍeśhum̐ḍu
nĕlagŏni nannunelĕ nīvūm̐ gūḍam̐gadave