ఏడు మల్లెలెత్తు సుకుమారికి
పల్లవి:
ఏడు మల్లెలెత్తు సుకుమారికి ఎంత కష్టం వచ్చింది నాయనో
భోగి పళ్ళు పొయ్యాలి బేబికి ఏమి దిష్టికొట్టింది నాయనో
ముగ్గులెట్టు ముచ్చట్లలో ముచ్చెమట్లు పట్టాయిరో
మంచుబొట్లు ఆ బుగ్గలో అగ్గి చుక్కలైనాయిరో
ఏ..ముగ్గులెట్టు ముచ్చట్లలో ముచ్చెమట్లు పట్టాయిరో
మంచుబొట్లు ఆ బుగ్గలో అగ్గి చుక్కలైనాయిరో
చరణం 1:
పాతమంచమిదిగో పట్టుకొచ్చినానురో భగ్గుమంటు మండుతాదిరో
పేకతల్లిరో పీకులాడమందిరో సందు చూసి సద్దుకోరో హోయ్
బోడిజుట్టు ఉందని కోడిపుంజుకావురో కాలుదువ్విరాకయ్యో
ఎక్కిరించనా ఎంతచక్కకుంటవే నా పడచు పావురాయో
అలా మాయమాటలాడితే ఐసైపోనయ్యో
బలాదూరు మానకుంటే భరతం పడతాడు మా మామయ్య
హరిలో రంగా హరీ చూడరో దీనల్లరి
గాదెలో నిండే వరి వీధిలో చిందే సిరి
సువ్వి సువ్వి గొబ్బిళ్ళ పాటకి నవ్వి నవ్వి తాళాలు వెయ్యరో
చరణం 2:
ఎంత గోల పెట్టినా నెత్తి మీదకొచ్చెరో కుంకుడు స్నానాలు
చింత మొద్దులా అంతనిద్దరేందిరా ఏమాయె పౌరుషాలు
ఎముకలు కొరికే ఈ చలికురిమి చెమటలు కక్కించరో
అహ మంచుగడ్డిలా ఉండరేమి మంటపాలు చెయ్యిరేరో
ప్రతి ఇంట బూరెల వంట మహబాగుంది సరే
కనుం దాకా కక్కా ముక్కా దొరకదు అది ఒక లోటే కదరో
సంకురాత్రి పండగొచ్చెరో సంబరాలు తెచ్చేనురో
గంగిరెద్దు ఇంటికొచ్చెరో గంగడోలు దువ్వి పంపరో
తెలుగింట లోగిళ్ళలోనికి పెద్దపండగొచ్చింది చూడరో
కిల కిల సందళ్ళతో ఇలా కొత్తపొద్దు తెచ్చింది చూడరో
సంకురాత్రి పండగొచ్చెరో సంబరాలు తెచ్చేనురో
గంగిరెద్దు ఇంటికొచ్చెరో గంగడోలు దువ్వి పంపరో
హే..సంకురాత్రి పండగొచ్చెరో సంబరాలు తెచ్చేనురో
గంగిరెద్దు ఇంటికొచ్చెరో గంగడోలు దువ్వి పంపరో
pallavi:
eḍu mallĕlĕttu sugumārigi ĕṁta kaṣhṭaṁ vachchiṁdi nāyano
bhogi paḽḽu pŏyyāli bebigi emi diṣhṭigŏṭṭiṁdi nāyano
muggulĕṭṭu muchchaṭlalo muchchĕmaṭlu paṭṭāyiro
maṁchubŏṭlu ā buggalo aggi sukkalaināyiro
e..muggulĕṭṭu muchchaṭlalo muchchĕmaṭlu paṭṭāyiro
maṁchubŏṭlu ā buggalo aggi sukkalaināyiro
saraṇaṁ 1:
pādamaṁchamidigo paṭṭugŏchchinānuro bhaggumaṁṭu maṁḍudādiro
pegadalliro pīgulāḍamaṁdiro saṁdu sūsi saddugoro hoy
boḍijuṭṭu uṁdani koḍibuṁjugāvuro kāluduvvirāgayyo
ĕkkiriṁchanā ĕṁtasakkaguṁṭave nā paḍasu pāvurāyo
alā māyamāḍalāḍide aisaibonayyo
balādūru mānaguṁṭe bharadaṁ paḍadāḍu mā māmayya
harilo raṁgā harī sūḍaro dīnallari
gādĕlo niṁḍe vari vīdhilo siṁde siri
suvvi suvvi gŏbbiḽḽa pāḍagi navvi navvi tāḽālu vĕyyaro
saraṇaṁ 2:
ĕṁta gola pĕṭṭinā nĕtti mīdagŏchchĕro kuṁkuḍu snānālu
siṁta mŏddulā aṁtaniddareṁdirā emāyĕ pauruṣhālu
ĕmugalu kŏrige ī saligurimi sĕmaḍalu kakkiṁcharo
aha maṁchugaḍḍilā uṁḍaremi maṁṭabālu sĕyyirero
pradi iṁṭa būrĕla vaṁṭa mahabāguṁdi sare
kanuṁ dāgā kakkā mukkā dŏragadu adi ŏga loḍe kadaro
saṁkurātri paṁḍagŏchchĕro saṁbarālu tĕchchenuro
gaṁgirĕddu iṁṭigŏchchĕro gaṁgaḍolu duvvi paṁparo
tĕlugiṁṭa logiḽḽalonigi pĕddabaṁḍagŏchchiṁdi sūḍaro
kila kila saṁdaḽḽado ilā kŏttabŏddu tĕchchiṁdi sūḍaro
saṁkurātri paṁḍagŏchchĕro saṁbarālu tĕchchenuro
gaṁgirĕddu iṁṭigŏchchĕro gaṁgaḍolu duvvi paṁparo
he..saṁkurātri paṁḍagŏchchĕro saṁbarālu tĕchchenuro
gaṁgirĕddu iṁṭigŏchchĕro gaṁgaḍolu duvvi paṁparo