Edodalo virabooseno ee puvvu

ఏతోటలో విరబూసెనో ఈ పువ్వు
Year
Language

పల్లవి:

ఏ తోటలో విరబూసెనో ఈ పువ్వు
నా ఇంటిలో విరజల్లెను చిరునవ్వు
ఏ తోటలో విరబూసెనో ఈ నవ్వు

చరణం 1:

ఈ చిరుత నవ్వులు ఏ జంట పంటలో
ఈ చిలిపి కన్నులు అవి ఏ వలపు కలలో...
ఏ తోటలో విరబూసెనో ఈ పువ్వు

చరణం 2:

బ్రహ్మచారినే నాన్నను చేసి...పక పక కొంటెగా నవ్వేవు
బ్రహ్మచారినే నాన్నను చేసి...పక పక కొంటెగా నవ్వేవు
నీ నవ్వులో ఏమున్నదో మైకము
నా వాడవే అని నమ్మెను లోకం
ఏ తోటలో విరబూసెనో ఈ పువ్వు...

చరణం 3:

పసి పాప అంటే దేవుడురా...సత్యానికి నువు సాక్షమురా
పసి పాప అంటే దేవుడురా...సత్యానికి నువు సాక్షమురా
ఏవరో అల్లిన కల్లలకు...నువ్వెందుకు పందిరివైనావు..

ఏ తోటలో విరబూసెనో ఈ పువ్వు
నా ఇంటిలో విరజల్లెను చిరునవ్వు...ఉ...

ఈ తోటలో ఒకమాలిని ...ఒక మాలతి
ప్రేమించినది తనదేనని నమ్మినది
ఈ చిరుత నవ్వులు ఆ జంట పంటలే
ఈ చిలిపికన్నులు ఆ వలపు కలలే...

pallavi:

e toḍalo virabūsĕno ī puvvu
nā iṁṭilo virajallĕnu sirunavvu
e toḍalo virabūsĕno ī navvu

saraṇaṁ 1:

ī siruda navvulu e jaṁṭa paṁṭalo
ī silibi kannulu avi e valabu kalalo...
e toḍalo virabūsĕno ī puvvu

saraṇaṁ 2:

brahmasārine nānnanu sesi...paga paga kŏṁṭĕgā navvevu
brahmasārine nānnanu sesi...paga paga kŏṁṭĕgā navvevu
nī navvulo emunnado maigamu
nā vāḍave ani nammĕnu logaṁ
e toḍalo virabūsĕno ī puvvu...

saraṇaṁ 3:

pasi pāba aṁṭe devuḍurā...satyānigi nuvu sākṣhamurā
pasi pāba aṁṭe devuḍurā...satyānigi nuvu sākṣhamurā
evaro allina kallalagu...nuvvĕṁdugu paṁdirivaināvu..

e toḍalo virabūsĕno ī puvvu
nā iṁṭilo virajallĕnu sirunavvu...u...

ī toḍalo ŏgamālini ...ŏga māladi
premiṁchinadi tanadenani namminadi
ī siruda navvulu ā jaṁṭa paṁṭale
ī silibigannulu ā valabu kalale...