Edirim danneramgadu yeppudoo valabamduru

ఎదిరిఁ దన్నెరఁగదు యెప్పుడూ వలపందురు
Language

(॥పల్లవి॥)
ఎదిరిఁ దన్నెరఁగదు యెప్పుడూ వలపందురు
కదిసి యా మాఁట నేఁడు గానవచ్చె మాకును

(॥ఎది॥)
వెలఁది మట్టెలు నీవేలనే వుండఁగానే
చెలరేఃగి నన్ను నెంత చెక్కు నొక్కేవు
పలుసోఁకులు పెదవిఁ బాదుకొని యుండఁగానే
మలసి యప్పటి నాతో మాఁటలాడేవు

(॥ఎది॥)
కొమ్మ ముడిపువ్వులు నీ కొప్పులోన నుండఁగానే
ముమ్మాటికి చేతులపై మొక్కవచ్చేవు
కుమ్మెలై గుబ్బలొత్తిన గురుతు మై నండఁగానే
కమ్మటి సిబ్బితి లేక కాఁగిలించ వచ్చేవు

(॥ఎది॥)
పడఁతి కస్తూరిపూఁత పచ్చడ మంటుండఁగానే
అడరి నామీఁద గప్పి యాదరించేవు
యెడయ కిట్టె శ్రీవేంకటేశ నన్ను నేలితివి
నడుమ నాకె వుండఁగా నమ్మికిచ్చేవు

(||pallavi||)
ĕdirim̐ dannĕram̐gadu yĕppuḍū valabaṁduru
kadisi yā mām̐ṭa nem̐ḍu gānavachchĕ māgunu

(||ĕdi||)
vĕlam̐di maṭṭĕlu nīvelane vuṁḍam̐gāne
sĕlareḥgi nannu nĕṁta sĕkku nŏkkevu
palusom̐kulu pĕdavim̐ bādugŏni yuṁḍam̐gāne
malasi yappaḍi nādo mām̐ṭalāḍevu

(||ĕdi||)
kŏmma muḍibuvvulu nī kŏppulona nuṁḍam̐gāne
mummāḍigi sedulabai mŏkkavachchevu
kummĕlai gubbalŏttina gurudu mai naṁḍam̐gāne
kammaḍi sibbidi lega kām̐giliṁcha vachchevu

(||ĕdi||)
paḍam̐ti kastūribūm̐ta pachchaḍa maṁṭuṁḍam̐gāne
aḍari nāmīm̐da gappi yādariṁchevu
yĕḍaya kiṭṭĕ śhrīveṁkaḍeśha nannu nelidivi
naḍuma nāgĕ vuṁḍam̐gā nammigichchevu