Ediri neṟamgavu nee yidave soosevugaani

ఎదిరి నెఱఁగవు నీ యితవే చూచేవుగాని
Language

(॥పల్లవి॥)
ఎదిరి నెఱఁగవు నీ యితవే చూచేవుగాని
యెదఁ బెట్టున్నారము యేము(మ?) నేము నేము

(॥ఎది॥)
గడుసునిన్నుఁ జూచితే కాఁకరేఁగీ నాకైతే
నడుమ నీవూరకే నవ్వేవు గాని
వుడికినందుమీఁదట వుప్పలు చల్లినట్టాయ
యెడనెడ నీచేఁతల కేమనేము నేము

(॥ఎది॥)
కుచ్చితపునిన్నుఁ జేరుకొనఁ గొలుపదు నాకు
అచ్చువలె నీవు మాటలాడేవుగాని
ముచ్చటదీర నీవేళ మోము గప్పినట్లాయ
హెచ్చిననీసుద్దులకు నేమనేము నేము

(॥ఎది॥)
దిమ్మరిని న్నంటుకొన సమ్మతించదు నాకైతే
లెమ్మని నీవే కాఁగిలించేవుగాని
చిమ్ముచు శ్రీవేంకటేశ చేఁదే తీపైనట్లాయ
యెమ్మెలనీమన్ననకు యేమనేము నేము

(||pallavi||)
ĕdiri nĕṟam̐gavu nī yidave sūsevugāni
yĕdam̐ bĕṭṭunnāramu yemu(ma?) nemu nemu

(||ĕdi||)
gaḍusuninnum̐ jūside kām̐karem̐gī nāgaide
naḍuma nīvūrage navvevu gāni
vuḍiginaṁdumīm̐daḍa vuppalu sallinaṭṭāya
yĕḍanĕḍa nīsem̐tala kemanemu nemu

(||ĕdi||)
kuchchidabuninnum̐ jerugŏnam̐ gŏlubadu nāgu
achchuvalĕ nīvu māḍalāḍevugāni
muchchaḍadīra nīveḽa momu gappinaṭlāya
hĕchchinanīsuddulagu nemanemu nemu

(||ĕdi||)
dimmarini nnaṁṭugŏna sammadiṁchadu nāgaide
lĕmmani nīve kām̐giliṁchevugāni
simmusu śhrīveṁkaḍeśha sem̐de tībainaṭlāya
yĕmmĕlanīmannanagu yemanemu nemu