పల్లవి:
ఓహొహొహో.. ఓహొహొహో..హోయ్
ఏడనున్నాడో ఎక్కడున్నాడో..
చూడచక్కని చుక్కలరేడు.. ఈడు జోడు కలిసినవాడు
ఏడనున్నాడో ఎక్కడున్నాడో..
నా చుక్కలరేడు.. ఏడనున్నాడో ఎక్కడున్నాడో..
హేయ్..
చరణం 1:
ఓహొహొహో.. ఓహొహొహో..
గాలి రెక్కల పక్షుల్లారా..ఆ..
గాలి రెక్కల పక్షుల్లారా.. పాల వన్నెల మబ్బుల్లారా..ఓ.. ఓ.. ఓ..
గాలి రెక్కల పక్షుల్లారా.. పాల వన్నెల మబ్బుల్లారా
పక్షుల్లారా.. మబ్బుల్లారా..
మనసు చూరగొని మాయమైన మక్కువరేడే..
ఏడనున్నాడో ఎక్కడున్నాడో...
నా చుక్కలరేడు.. ఏడనున్నాడో ఎక్కడున్నాడో
హేయ్..
చరణం 2:
ఓ.. ఓ..ఓ..ఓ..
పొగడపొన్నల పువ్వలవీడ..
పొగడపొన్నల పువ్వలవీడ.. పూల వీధిలో తుమ్మెదున్నాడా
పొగడపొన్నల పువ్వలవీడ.. పూల వీధిలో తుమ్మెదున్నాడా
గున్నమామిడి కొమ్మలగూడా.. గూటిలోన గండు కోయిలలేడా
గున్నమామిడి కొమ్మలగూడా.. గూటిలోన గండు కోయిలలేడా
కోయిలలేడా.. తుమ్మెదున్నాడా..
కులుకు బెలుకుగల కోడె ప్రాయపు కొంటివాడే..
ఏడనున్నాడో ఎక్కడున్నాడో
నా చుక్కలరేడు.. ఏడనున్నాడో ఎక్కడున్నాడో
చూడచక్కని చుక్కలరేడు.. ఈడు జోడు కలిసినవాడు
ఏడనున్నాడో ఎక్కడున్నాడో..
నా చుక్కలరేడు.. ఏడనున్నాడో ఎక్కడున్నాడో