ఏడనుండి వచ్చినాఁడే యీడకుఁ దాను
(॥పల్లవి॥)
ఏడనుండి వచ్చినాఁడే యీడకుఁ దాను
వీడెమిచ్చీఁ జూడవే వేసాలవాఁడు
(॥ఏడ॥)
వెలలేనివలపుల వేడుకకాఁడు
కలికితనాలమంచిగయ్యాళివాఁడు
చలమరిసరసాలజాజరకాఁడు
చెలువుఁడు వీఁడుగదె శ్రీవేంకటేశుఁడు
(॥ఏడ॥)
కొనబుతనాలతోడికోడెకాఁడు
వినుపునవ్వులునవ్వేనీటులవాఁడు
వొనరినవరముల వుదారికాఁడు
చెనకులవాఁడుగదే శ్రీవేంకటేశుఁడు
(॥ఏడ॥)
గొల్లెతలమానములుకొల్లకాఁడు
పిల్లదొరులూఁదేటిపిన్నవాఁడు
యెల్లగా నలమేల్మంగనేలినవాఁడు
చెల్లుబడి వీఁ(వాఁ?) డుగదె శ్రీవేంకటేశుఁడు
(||pallavi||)
eḍanuṁḍi vachchinām̐ḍe yīḍagum̐ dānu
vīḍĕmichchīm̐ jūḍave vesālavām̐ḍu
(||eḍa||)
vĕlalenivalabula veḍugagām̐ḍu
kaligidanālamaṁchigayyāḽivām̐ḍu
salamarisarasālajājaragām̐ḍu
sĕluvum̐ḍu vīm̐ḍugadĕ śhrīveṁkaḍeśhum̐ḍu
(||eḍa||)
kŏnabudanāladoḍigoḍĕgām̐ḍu
vinubunavvulunavvenīḍulavām̐ḍu
vŏnarinavaramula vudārigām̐ḍu
sĕnagulavām̐ḍugade śhrīveṁkaḍeśhum̐ḍu
(||eḍa||)
gŏllĕdalamānamulugŏllagām̐ḍu
pilladŏrulūm̐deḍibinnavām̐ḍu
yĕllagā nalamelmaṁganelinavām̐ḍu
sĕllubaḍi vīm̐(vām̐?) ḍugadĕ śhrīveṁkaḍeśhum̐ḍu