ఎడమాఁట లిఁకనేల యెదుట నున్నాఁ డతఁడు
(॥పల్లవి॥)
ఎడమాఁట లిఁకనేల యెదుట నున్నాఁ డతఁడు
పిడికిటి సేస వెట్టి పిలువవే ఇంటికి
(॥ఎడ॥)
వినయాలే పచరించి వేడుకలు వుట్టించి
మనసురా నతనితో మాటలాడవే
చనవు సేసుక కడుసరసము లెల్లా నాడి
పెసఁగి పెనఁగి యిట్టె పిలువవే యింటికి
(॥ఎడ॥)
చల్లని చూపులఁ జూచి చక్కని మోము చూపి
వెల్లవిరిగా మొక్కి వీడెమియ్యవే
పుల్లము గరఁగ మేన వుదుటుగుబ్బల నూఁది
పెల్లునఁ బ్రియము చెప్పి పిలువవే ఇంటికి
(॥ఎడ॥)
చుట్టరికములు చెప్పి సొంపుగా నవ్వులు నవ్వి
గట్టిఁగా గొసరి యిచ్చకము చూపవే
యిట్టె శ్రీవేంకటేశుఁ డింతలోనె నిన్ను నేలె
పెట్టరాని యాన వెట్టి పిలువవే యింటికి
(||pallavi||)
ĕḍamām̐ṭa lim̐kanela yĕduḍa nunnām̐ ḍadam̐ḍu
piḍigiḍi sesa vĕṭṭi piluvave iṁṭigi
(||ĕḍa||)
vinayāle pasariṁchi veḍugalu vuṭṭiṁchi
manasurā nadanido māḍalāḍave
sanavu sesuga kaḍusarasamu lĕllā nāḍi
pĕsam̐gi pĕnam̐gi yiṭṭĕ piluvave yiṁṭigi
(||ĕḍa||)
sallani sūbulam̐ jūsi sakkani momu sūbi
vĕllavirigā mŏkki vīḍĕmiyyave
pullamu garam̐ga mena vuduḍugubbala nūm̐di
pĕllunam̐ briyamu sĕppi piluvave iṁṭigi
(||ĕḍa||)
suṭṭarigamulu sĕppi sŏṁpugā navvulu navvi
gaṭṭim̐gā gŏsari yichchagamu sūbave
yiṭṭĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ ninnu nelĕ
pĕṭṭarāni yāna vĕṭṭi piluvave yiṁṭigi