ఎడఁ గొల్లకత్తె నీకె నేమందును
(॥పల్లవి॥)
ఎడఁ గొల్లకత్తె నీకె నేమందును
నడుమఁ జుట్టరికాలు నడపీఁ దాను
(॥ఎడ॥)
వంచనతో విందుచెప్పి వడి నిన్నుఁ దోడితేఁగా
కంచముపొత్తుకు నీకె గాచుకున్నది
మంచముపైనే నిన్ను మరి కూచుండఁబెట్టితే
లంచము మోవినియ్య లాఁచీఁదాను
(॥ఎడ॥)
పై కొని నీచేతికి బాగాలొసఁగితేను
ఆకుమడిచియ్య నీకె అమరినది
చేకొని పవ్వళించఁగఁజేసి నినానదరించితే
జోకల తాఁ బాదాలొత్తజోటుచేసుకున్నది
(॥ఎడ॥)
నేను నీవు కాఁగిటిలో నెయ్యము సలుపఁగాను
ఆనించి తనచన్నుల నంటుకున్నది
పూని శ్రీ వేంకటేశుఁడ పొంది నే సేసవెట్టఁగా
కానిమ్మని కంకణము గట్టీఁదాను
(||pallavi||)
ĕḍam̐ gŏllagattĕ nīgĕ nemaṁdunu
naḍumam̐ juṭṭarigālu naḍabīm̐ dānu
(||ĕḍa||)
vaṁchanado viṁdusĕppi vaḍi ninnum̐ doḍidem̐gā
kaṁchamubŏttugu nīgĕ gāsugunnadi
maṁchamubaine ninnu mari kūsuṁḍam̐bĕṭṭide
laṁchamu moviniyya lām̐sīm̐dānu
(||ĕḍa||)
pai kŏni nīsedigi bāgālŏsam̐gidenu
āgumaḍisiyya nīgĕ amarinadi
segŏni pavvaḽiṁcham̐gam̐jesi ninānadariṁchide
jogala tām̐ bādālŏttajoḍusesugunnadi
(||ĕḍa||)
nenu nīvu kām̐giḍilo nĕyyamu salubam̐gānu
āniṁchi tanasannula naṁṭugunnadi
pūni śhrī veṁkaḍeśhum̐ḍa pŏṁdi ne sesavĕṭṭam̐gā
kānimmani kaṁkaṇamu gaṭṭīm̐dānu