ఏడకుఁ బోనేల నీకు నిందు రావయ్యా
(॥పల్లవి॥)
ఏడకుఁ బోనేల నీకు నిందు రావయ్యా
వాడుదేర నా వెూము చూడవయ్యా
(॥॥)
చుట్టమవైనవాఁడవు సుద్దులు చెప్పవాఁడవు
ఇట్టె మాయింటికి వచ్చి యెనయవయ్యా
దిట్టవైనవాఁడవు తీరనిపంతగాఁడవు
బెట్టగునాచన్నులతోఁ బెనఁగవయ్యా
(॥॥)
వలచినవాఁడవు వసమైనవాఁడవు
ఇల నాచేసేసేవలు సేయించుకోవయ్యా
సెలవి నవ్వేవాఁడవు చెందినమేనవాఁ డవు
వలసినట్లఁ గూడి వద్దనుండవయ్యా
(॥॥)
నమ్మికిచ్చినవాఁడవు నాపాలివాఁడవు
ఇమ్ముల నాకిట్టె కాఁగి లియ్యవయ్యా
నెమ్మది శ్రీవేంకటేశ నేఁడు నామేలువాఁడవు
కమ్మటి నన్నుఁ గూడి కరుణించవయ్యా
(||pallavi||)
eḍagum̐ bonela nīgu niṁdu rāvayyā
vāḍudera nā vĕూmu sūḍavayyā
(||||)
suṭṭamavainavām̐ḍavu suddulu sĕppavām̐ḍavu
iṭṭĕ māyiṁṭigi vachchi yĕnayavayyā
diṭṭavainavām̐ḍavu tīranibaṁtagām̐ḍavu
bĕṭṭagunāsannuladom̐ bĕnam̐gavayyā
(||||)
valasinavām̐ḍavu vasamainavām̐ḍavu
ila nāsesesevalu seyiṁchugovayyā
sĕlavi navvevām̐ḍavu sĕṁdinamenavām̐ ḍavu
valasinaṭlam̐ gūḍi vaddanuṁḍavayyā
(||||)
nammigichchinavām̐ḍavu nābālivām̐ḍavu
immula nāgiṭṭĕ kām̐gi liyyavayyā
nĕmmadi śhrīveṁkaḍeśha nem̐ḍu nāmeluvām̐ḍavu
kammaḍi nannum̐ gūḍi karuṇiṁchavayyā