ఎచ్చరించవైతివంటా యేల నన్ను దూరేవు యీ
(॥పల్లవి॥)
ఎచ్చరించవైతివంటా యేల నన్ను దూరేవు యీ-
తచ్చనను గురిసేయఁదగవా నాకు
(॥ఎచ్చ॥)
కన్నె నీకు వద్దనుండి కప్పురవిడె మియ్యఁగ
సన్నలు సేసి పిలువ సంగతే నాకు
పున్నమ వెన్నెలలోన పొందులు మీరు చేయఁగ
పన్ని నే వద్దికి రాను పాడియౌనా నాకు
(॥ఎచ్చ॥)
మంచముపై నాపె నీవు మాటలాడుకొనఁగాను
పంచలఁ గానుకలియ్య భావ్యమా నాకు
మించిన వేడుకతోడ మీరిద్దరు నిద్రించఁగా
అంచెలను లేప నాయమౌనా నాకు
(॥ఎచ్చ॥)
మచ్చికఁ గాంతనుఁ గూడి మా ఇంటికి రాఁగాను
వొచ్చములు మిమ్ము నెంచ వోజా నాకు
ఇచ్చగించి శ్రీ వేంకటేశ నన్నుఁ గూడితివి
రిచ్చల సిగ్గులువడ రీతియౌనా నాకు
(||pallavi||)
ĕchchariṁchavaidivaṁṭā yela nannu dūrevu yī-
tachchananu guriseyam̐dagavā nāgu
(||ĕchcha||)
kannĕ nīgu vaddanuṁḍi kappuraviḍĕ miyyam̐ga
sannalu sesi piluva saṁgade nāgu
punnama vĕnnĕlalona pŏṁdulu mīru seyam̐ga
panni ne vaddigi rānu pāḍiyaunā nāgu
(||ĕchcha||)
maṁchamubai nābĕ nīvu māḍalāḍugŏnam̐gānu
paṁchalam̐ gānugaliyya bhāvyamā nāgu
miṁchina veḍugadoḍa mīriddaru nidriṁcham̐gā
aṁchĕlanu leba nāyamaunā nāgu
(||ĕchcha||)
machchigam̐ gāṁtanum̐ gūḍi mā iṁṭigi rām̐gānu
vŏchchamulu mimmu nĕṁcha vojā nāgu
ichchagiṁchi śhrī veṁkaḍeśha nannum̐ gūḍidivi
richchala sigguluvaḍa rīdiyaunā nāgu