ఏ పొద్దూఁ గొలువు సేసీ నింతులతోను
(॥పల్లవి॥)
ఏ పొద్దూఁ గొలువు సేసీ నింతులతోను
యేపున మేడలోనికి యిట్టె రమ్మనవే
(॥॥)
వింతవారిమాటలైతే వినవేడుకలై యుండు
సంతవారి జూడనై తే జరగు మతి
చింతలపులుసులకు చెలరేగి నోరూరు
యెంతలేదు రమణుని నీడకు రమ్మనవే
(॥॥)
నవ్వేవారి వద్దనుంటే ననుపుల బొద్దు లెక్కు
దవ్వుల సన్నలకైతేఁ దమివుట్టును
పువ్వులవాసనగాలి పొలసితే నాసవుట్టు
వువ్విళ్లూర నెంతలేదు వొద్దికిరమ్మనవే
(॥॥)
మేనవారివావులకు మేలములు పెచ్చురేఁగు
కానికనిమ్మపండ్లకుఁ గడఁగుఁజేయి
యే నలమేలుమంగను యిట్టె తా శ్రీవేంకటేశుఁ-
డానుక నన్నేలె నిట్టే అప్పటి రమ్మనవే
(||pallavi||)
e pŏddūm̐ gŏluvu sesī niṁtuladonu
yebuna meḍalonigi yiṭṭĕ rammanave
(||||)
viṁtavārimāḍalaide vinaveḍugalai yuṁḍu
saṁtavāri jūḍanai te jaragu madi
siṁtalabulusulagu sĕlaregi norūru
yĕṁtaledu ramaṇuni nīḍagu rammanave
(||||)
navvevāri vaddanuṁṭe nanubula bŏddu lĕkku
davvula sannalagaidem̐ damivuṭṭunu
puvvulavāsanagāli pŏlaside nāsavuṭṭu
vuvviḽlūra nĕṁtaledu vŏddigirammanave
(||||)
menavārivāvulagu melamulu pĕchchurem̐gu
kāniganimmabaṁḍlagum̐ gaḍam̐gum̐jeyi
ye nalamelumaṁganu yiṭṭĕ tā śhrīveṁkaḍeśhum̐-
ḍānuga nannelĕ niṭṭe appaḍi rammanave