E paraaguna nunnaamdo yemi seseeno taanu

ఏ పరాకున నున్నాఁడో యేమి సేసీనో తాను
Language

(॥పల్లవి॥)
ఏ పరాకున నున్నాఁడో యేమి సేసీనో తాను
చేపట్టి మన్నించుఁగాని చెప్పరే యీ కతలు

(॥ఏప॥)
పొలఁతి మెయి వలపులే పులకలై మొలచెను
కలసేటి కోరికలె కతతలాయను
తలపోఁత లుమ్మగిలి తరచుఁ జెమటలాయ
చెలులాల విభునికిఁ జెప్పరే యీకతలు

(॥ఏప॥)
కామిని తమకములె గట్టి చన్నులై పెరిగె
నాముకొన్న సరసాలే నవ్వులాయను
తేమరేఁగే కరఁగులే తేనియలై మోవినూరె
చేముంచి యాతనితోడఁ జెప్పరే యీకతలు

(॥ఏప॥)
నొరిది నాసలు కనుచూపులై యెదురుకొనె
పెరరేఁపు నుప్పతిల్లి పిలుపులాయ
ఇరవై శ్రీవేంకటేశుఁ డిట్టె వచ్చి యింతి నేలె
సిరుల నితని కింకాఁ జెప్పరే యీకతలు

(||pallavi||)
e parāguna nunnām̐ḍo yemi sesīno tānu
sebaṭṭi manniṁchum̐gāni sĕppare yī kadalu

(||eba||)
pŏlam̐ti mĕyi valabule pulagalai mŏlasĕnu
kalaseḍi korigalĕ kadatalāyanu
talabom̐ta lummagili tarasum̐ jĕmaḍalāya
sĕlulāla vibhunigim̐ jĕppare yīgadalu

(||eba||)
kāmini tamagamulĕ gaṭṭi sannulai pĕrigĕ
nāmugŏnna sarasāle navvulāyanu
temarem̐ge karam̐gule teniyalai movinūrĕ
semuṁchi yādanidoḍam̐ jĕppare yīgadalu

(||eba||)
nŏridi nāsalu kanusūbulai yĕdurugŏnĕ
pĕrarem̐pu nuppadilli pilubulāya
iravai śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ vachchi yiṁti nelĕ
sirula nidani kiṁkām̐ jĕppare yīgadalu