ఏ దివిలో విరిసిన పారిజాతమో (Male)
పల్లవి:
ఏ దివిలో విరిసిన పారిజాతమో...
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో...
నా మదిలో నీవై నిండిపోయెనే....ఏ..ఏ..
ఏ దివిలో విరిసిన పారిజాతమో...
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో...
చరణం 1:
నీ రూపమే దివ్య దీపమై... నీ నవ్వులే నవ్యతారలై
నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే...ఏ..ఏ...
ఏ దివిలో విరిసిన పారిజాతమో...
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో...
చరణం 2:
పాలబుగ్గలను లేత సిగ్గులు... పల్లవించగా రావే...
నీలిముంగురులు పిల్లగాలితో... ఆటలాడగా రావే..
కాలి అందియలు ఘల్లు ఘల్లుమన... రాజహంసలా రావే...
ఏ దివిలో విరిసిన పారిజాతమో...
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో...
చరణం 3:
నిదుర మబ్బులను మెరుపు తీగవై... కలలు రేపినది నీవే...
బ్రతుకు వీణపై ప్రణయరాగములు ఆలపించినది నీవే
పదము పదములో మధువులూరగా... కావ్యకన్యవై రావే...
ఏ దివిలో విరిసిన పారిజాతమో..
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో...
pallavi:
e divilo virisina pārijādamo...
e kavilo mĕrisina premagīdamo...
nā madilo nīvai niṁḍiboyĕne....e..e..
e divilo virisina pārijādamo...
e kavilo mĕrisina premagīdamo...
saraṇaṁ 1:
nī rūbame divya dībamai... nī navvule navyadāralai
nā kannula vĕnnĕla kāṁti niṁpĕne...e..e...
e divilo virisina pārijādamo...
e kavilo mĕrisina premagīdamo...
saraṇaṁ 2:
pālabuggalanu leda siggulu... pallaviṁchagā rāve...
nīlimuṁgurulu pillagālido... āḍalāḍagā rāve..
kāli aṁdiyalu ghallu ghallumana... rājahaṁsalā rāve...
e divilo virisina pārijādamo...
e kavilo mĕrisina premagīdamo...
saraṇaṁ 3:
nidura mabbulanu mĕrubu tīgavai... kalalu rebinadi nīve...
bradugu vīṇabai praṇayarāgamulu ālabiṁchinadi nīve
padamu padamulo madhuvulūragā... kāvyaganyavai rāve...
e divilo virisina pārijādamo..
e kavilo mĕrisina premagīdamo...