దొరవౌదు విన్నిటాను దోసమెరఁగవుగాని
(॥పల్లవి॥)
దొరవౌదు విన్నిటాను దోసమెరఁగవుగాని
తెరమఱఁగే సుమ్మీ తెలిసె నన్నియును
(॥దొర॥)
నగితినా నీతోను నాలోని ప్రియములు
చిగురై వెడలెఁగాక సెలవులను
మొగము చూచి నీమోవినే యేల తిట్టేవు
వొగరే పులుసుగాదా వొరయకు నీవు
(॥దొర॥)
జంకిచితినా నిన్ను చనవు మనవులెల్లా
వుంకువలై నిండెఁగాక వొగి బొమ్మల
కొంకక దగ్గరి మమ్ము కొంగులేల పట్టేవు
సుంకులే పాలుకొనవా సుద్దులేల మాతోను
(॥దొర॥)
కాఁగిట బిగించితినా గక్కన శ్రీ వేంకటేశ
చేఁగలవలపులే చిక్కించెఁగాక
రాఁగి నీవు మమ్మునేల రచ్చలఁబెట్టి కూడితి
వాఁగి కెరుగునఁగాదా అట్టె వెన్న వుట్టేది
(||pallavi||)
dŏravaudu vinniḍānu dosamĕram̐gavugāni
tĕramaṟam̐ge summī tĕlisĕ nanniyunu
(||dŏra||)
nagidinā nīdonu nāloni priyamulu
sigurai vĕḍalĕm̐gāga sĕlavulanu
mŏgamu sūsi nīmovine yela tiṭṭevu
vŏgare pulusugādā vŏrayagu nīvu
(||dŏra||)
jaṁkisidinā ninnu sanavu manavulĕllā
vuṁkuvalai niṁḍĕm̐gāga vŏgi bŏmmala
kŏṁkaga daggari mammu kŏṁgulela paṭṭevu
suṁkule pālugŏnavā suddulela mādonu
(||dŏra||)
kām̐giḍa bigiṁchidinā gakkana śhrī veṁkaḍeśha
sem̐galavalabule sikkiṁchĕm̐gāga
rām̐gi nīvu mammunela rachchalam̐bĕṭṭi kūḍidi
vām̐gi kĕrugunam̐gādā aṭṭĕ vĕnna vuṭṭedi