Dora nimma pamdulaaga oorimche dorasaani

దోర నిమ్మ పండులాగ ఊరించే దొరసాని
Year
Language

పల్లవి:

దోర నిమ్మపండులాగ ఊరించే దొరసాని
దోచుకోనా నీ పరువం ...దాచలేనే ఈ విరహం

చరణం 1:

పూలలోన సోయగాలు పొంగిపోయే నీలోన
నింగిలోని చందమామ తొంగి చూసె నీలోన

మెరుపులోని చురుకుదనాలు మెరిసిపోయె నీలోన
మెరుపులోని చురుకుదనాలు మెరిసిపోయె నీలోన
మరులొలికే నీ మగసిరి చూసి కరిగిపోదును లోలోనా!

దోర నిమ్మపండులాగ ఊరించే దొరసాని
దోచుకోనా నీ పరువం... దాచలేనే ఈ విరహం

చరణం 2:

మేనిలోన వీణలేవో మెలమెల్లగ పలికినవి
మనసులోన తేనెలేవో సనసనాగ ఒళికినవి

నన్ను నీవు తాగగానే నడిరాతిరి నవ్వింది
నన్ను నీవు తాగగానే నడిరాతిరి నవ్వింది
వగలులూరే నీ నగవులు దాగే వలపు బాస తెలిసింది!

దోర నిమ్మపండులాగ ఊరించే దొరగారు
దోచుకో ఇక నా పరువం... దాచుటెందుకు నీ విరహం !

pallavi:

dora nimmabaṁḍulāga ūriṁche dŏrasāni
dosugonā nī paruvaṁ ...dāsalene ī virahaṁ

saraṇaṁ 1:

pūlalona soyagālu pŏṁgiboye nīlona
niṁgiloni saṁdamāma tŏṁgi sūsĕ nīlona

mĕrubuloni surugudanālu mĕrisiboyĕ nīlona
mĕrubuloni surugudanālu mĕrisiboyĕ nīlona
marulŏlige nī magasiri sūsi karigibodunu lolonā!

dora nimmabaṁḍulāga ūriṁche dŏrasāni
dosugonā nī paruvaṁ... dāsalene ī virahaṁ

saraṇaṁ 2:

menilona vīṇalevo mĕlamĕllaga paliginavi
manasulona tenĕlevo sanasanāga ŏḽiginavi

nannu nīvu tāgagāne naḍirādiri navviṁdi
nannu nīvu tāgagāne naḍirādiri navviṁdi
vagalulūre nī nagavulu dāge valabu bāsa tĕlisiṁdi!

dora nimmabaṁḍulāga ūriṁche dŏragāru
dosugo iga nā paruvaṁ... dāsuḍĕṁdugu nī virahaṁ !