Dora mohimchamjooside tudamoda leramgamdu

దొర మోహించఁజూచితే తుదమొద లెరఁగఁడు
Language

(॥పల్లవి॥)
దొర మోహించఁజూచితే తుదమొద లెరఁగఁడు
ఇర వెక్కడౌతాఁ గాన విస్సిరో వయసా

(॥దొర॥)
చక్కని ఇంతి నీమోము సారెసారెఁ జూచిచూచి
చెక్కునొక్కి వలపులఁ జిమ్మిరేఁగేవు
యెక్కువసతులు వద్ద నెవ్వరుంటా నెఱఁగవు
యెక్కడ వోయ సిగ్గు లిస్సిరో వయసా

(॥దొర॥)
చన్నులు గదలఁగాను సతి నీతో నవ్వితేను
చెన్నుమీరఁ గరంగుతాఁ జెమరించేవు
అన్నిటా నీచేఁతలకునాడేవారినెఱఁగవు
యెన్నికి నిబుద్ది ఇస్సిరో వయసా

(॥దొర॥)
మురిపానఁ జెలి నీతో ముద్దులమాట లాడితే
సరుగఁ గాఁగిటఁ గూడి చనవిచ్చేవు
గరిమ శ్రీవేంకటేశు గంభీర మెఱఁగవు
యెరవైతి విందాఁకానిస్సిరో వయసా

(||pallavi||)
dŏra mohiṁcham̐jūside tudamŏda lĕram̐gam̐ḍu
ira vĕkkaḍaudām̐ gāna vissiro vayasā

(||dŏra||)
sakkani iṁti nīmomu sārĕsārĕm̐ jūsisūsi
sĕkkunŏkki valabulam̐ jimmirem̐gevu
yĕkkuvasadulu vadda nĕvvaruṁṭā nĕṟam̐gavu
yĕkkaḍa voya siggu lissiro vayasā

(||dŏra||)
sannulu gadalam̐gānu sadi nīdo navvidenu
sĕnnumīram̐ garaṁgudām̐ jĕmariṁchevu
anniḍā nīsem̐talagunāḍevārinĕṟam̐gavu
yĕnnigi nibuddi issiro vayasā

(||dŏra||)
muribānam̐ jĕli nīdo muddulamāḍa lāḍide
sarugam̐ gām̐giḍam̐ gūḍi sanavichchevu
garima śhrīveṁkaḍeśhu gaṁbhīra mĕṟam̐gavu
yĕravaidi viṁdām̐kānissiro vayasā